అర్జీల పరిష్కారంపై దృష్టిపెట్టండి | - | Sakshi
Sakshi News home page

అర్జీల పరిష్కారంపై దృష్టిపెట్టండి

Sep 29 2026 2:03 AM | Updated on Sep 29 2026 2:03 AM

కలెక్టర్‌ ఎం.విజయ సునీత పీజిఆర్‌ఎస్‌లో 216 అర్జీల స్వీకరణ

మార్కాపురం టౌన్‌: ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే పీజీఆర్‌ఎస్‌లో వచ్చే అర్జీల పరిష్కారంపై ఆయా శాఖల అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్‌ ఎం.విజయ సునీత అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌ ప్రాంగణంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో కలెక్టర్‌ అధికారులతో కలిసి ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఒకే సమస్యపై ప్రజలు పదేపదే కలెక్టరేట్‌ చుట్టూ తిరిగే పరిస్థితి రాకూడదని, రీ–ఓపెన్‌ అర్జీలు రాకుండా చూడాల్సిన పూర్తి బాధ్యత రెవెన్యూ అధికారులపైనే ఉందని స్పష్టం చేశారు. పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో వివిధ సమస్యలపై మొత్తం 216 అర్జీలు రాగా వాటిలో రెవెన్యూ సంబంధిత అర్జీలు 134, ఇతర శాఖల సంబంధిత అర్జీలు 82 వచ్చినట్టు తెలిపారు. వీటిలో 96 అర్జీలు వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలకు సంబంధించినవిగా తెలిపారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ పి.శ్రీనివాసులు, డీఆర్‌ఓ వెంకట శివరామి రెడ్డి, కనిగిరి ఆర్డీఓ అజయ్‌కుమార్‌, హౌసింగ్‌ పీడీ మోహన్‌రావు, డీఏఓ బాలాజీనాయక్‌, లీడ్‌ బ్యాంకు మేనేజరు షాహీర్‌, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement