● పొగాకు రైతులపై అన్యాయంగా కేసులు బనాయించారు
● అక్రమ కేసులు ఎక్కువ కాలం నిలవవు
● మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు
కొనకనమిట్ల: వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అన్నీ విధాలా అండగా ఉంటుందని మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు భరోసా ఇచ్చారు. గతేడాది పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పొగాకు రైతుల సమస్యలు తెలుసుకొనేందుకు పొదిలి పొగాకు బోర్డు సందర్శించారు. అప్పట్లో కూటమి ప్రభుత్వం అన్యాయంగా, అక్రమంగా జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతుగా వచ్చిన పార్టీ కార్యకర్తలు, పలువురు రైతులపై కేసుల పెట్టారు. కేసులు పెట్టిన వారిలో మండలంలోని వాగుమడుగు గ్రామానికి చెందిన బొరిగొర్ల తిరుపతయ్య, సాదం పెద్దవీరయ్య ఉన్నారు. గత నెలలో వారిని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం దర్శి సబ్‌జైల్‌కు పంపారు. వారికి మంగళవారం బెయిల్ మంజూరైంది. విషయం తెలుసుకున్న అన్నా రాంబాబు, పార్టీ నాయకులతో కలిసి దర్శి సబ్ జైల్ దగ్గరికి వెళ్లారు. దర్శి సబ్‌జైల్ నుంచి బెయిల్‌పై బయటికి వచ్చిన కార్యకర్తలను పరామర్శించారు. అక్రమ కేసులు ఎప్పుడూ నిలవవని, ఎవరూ భయపడొద్దని వారికి భరోసా ఇచ్చారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలకు నిరసనగా సమష్టిగా పోరాడదామన్నారు. ఏ సమస్యలు వచ్చినా పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. అన్నాతో పాటు జెడ్పీటీసీ అక్కిదాసరి ఏడుకొండలు, మండల పార్టీ కన్వీనర్ మోరా శంకర్‌రెడ్డి, వాగుమడుగు ఎంపీటీసీ పి.కృష్ణవేణి కోటయ్య, నాయకులు కల్లం దిబ్బారెడ్డి, బొరిగొర్లబాలయ్య తదితరులు ఉన్నారు.


