డీఎస్సీ మొత్తం అక్రమాలమయం | - | Sakshi
Sakshi News home page

డీఎస్సీ మొత్తం అక్రమాలమయం

Aug 7 2026 2:14 AM | Updated on Aug 7 2026 2:14 AM

సమావేశంలో మాట్లాడుతున్న ఇన్‌చార్జి డాక్టర్‌ అశోక్‌కుమార్‌

అద్దంకి:

కూటమి ప్రభుత్వం నిర్వహించింది మెగా డీఎస్సీ కాదని దగా డీఎస్సీ అని వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జి డాక్డర్‌ చింతలపూడి అశోక్‌కుమార్‌ ధ్వజమెత్తారు. డీఎస్సీలో చోటు చేసుకున్న అక్రమాలపై సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు. మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖామంత్రి లోకేష్‌ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. పట్టణంలోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన నియోకవర్గ స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. కార్యక్రమానికి ఎస్సీ సెల్‌ నాయకుడు నగేష్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా చింతలపూడి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో నిరుద్యోగ భృతి ఇస్తామని మాయమాటలు చెప్పారని, రెండేళ్లలో ఒక్క పైసా కూడా భృతి ఇవ్వలేదన్నారు. పేద, మధ్య తరగతి పిల్లల కోసం వైఎస్సార్‌ తీసుకువచ్చిన ఫీజు రీయింబర్స్‌ పథకానికి ఈ ప్రభుత్వం తూట్లు పొడిచిందన్నారు. డీఎస్పీ పరీక్షా పేపర్‌ ఎవరు ప్రిపేర్‌ చేస్తున్నారో, వాళ్లే ఎగ్జామ్‌ రాసి స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌ తెచు్‌ుచ్కన్నారంటే ఇంతకన్నా ఘోరమైన పరిస్థితి ఇంకోటి ఉంటుందా? అని ప్రశ్నించారు. మెగా డీఎస్సీలో యువ నాయకుని వెంట నడిచిన వారికి ఉద్యోగాలు ఇచ్చిన విషయం అందరికీ తెలుసన్నారు. స్పోర్ట్స్‌ కోటా అడ్డుపెట్టుకొని విచ్చలవిడిగా పోస్టులు అమ్ముకున్నారని మండిపడ్డారు. చరిత్రలో ఎక్కడా లేని విధంగా పేకాటను కూడా స్పోర్ట్స్‌ కోటాలో కలిపి ఉద్యోగాలిచ్చారంటే ఎంత బరితెగించారో అర్థం చేసుకోవాలన్నారు. డీఎస్సీ ఎగ్జామిషన్‌లో పేకాట కూడా అనుమతిస్తారా అని ప్రశ్నించారు. స్పోర్ట్స్‌ కేటగిరీలో అర్హులకు అందాల్సిన ఉద్యోగం అందకుండా వాళ్ల ఆధీనంలో ఉన్న కేటగిరీలకి వివిధ అసోసియేషన్‌ల ఆధ్వర్యంలో సర్టిఫికెట్లు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చారని మండిపడ్డారు. జాతీయస్థాయిలో గోల్డ్‌ మెడల్‌ సాధించిన వారికి కూడా ఉద్యోగాలు రాలేదన్నారు. ఉద్యోగాలు ఏ విధంగా అమ్ముకున్నారో ఆధారాలతో సహా ఆడియోలు బయటపెడితే ఎక్కడా అవకతవకలు జరగలేదంటున్నారని, ఇందులో సీఎం, విద్యా శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం వాటా ఎంతో ఒక్కసారి ఆలోచించుకోవాలన్నారు. అర్హులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎన్నికల సమయంలో ప్రజలను మోసం చేసేందుకు అడ్డగోలు హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించి ప్రజల జీవితాలతో ఆటలాడుతున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రచార విభాగం జాయింట్‌ సెక్రటరీ కోయి అంకారావు, కుంచాల శ్రీ విద్య, జజ్జర ఆనందరావు, కొల్లా భువనేశ్వరి, నియోజకవర్గ పరిశీలకుడు కేవీవీ ప్రసాద్‌, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు జ్యోతి హనుమంతరావు, జిల్లా జాయింట్‌ సెక్రటరీ కల్లి అంజనీ ప్రసాద్‌రెడ్డి, ఈదా శ్రీనివాసరెడ్డి, జడా విజయ్‌కుమార్‌, మండల కన్వీనర్లు గుజ్జుల జగన్‌మోహన్‌రెడ్డి, పాలపర్తి శ్రీధర్‌, ప్రశాంత్‌రెడ్డి, మధుబాబు, మట్టపూడి బాజీ వలి, రావిపాటి కాశీదేవి, స్వాతి, ఇస్తర్ల వెంకట్రావు, అధ్యక్షుడు రాజశేఖర్‌, జక్కుల బ్రహ్మయ్య, మురహరి యాదవ్‌, కనమర్లపూడి శ్రీనివాసరావులు డీఎస్సీ అక్రమాల గురించి ప్రసంగించారు. తక్షణమే విద్యాశాక మంత్రి అక్రమాలకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement