ఒంగోలు వన్‌టౌన్: శ్రీమీడియేషన్ ఫర్ నేషన్ 3.0శ్రీ కార్యక్రమంలో భాగంగా మధ్యవర్తిత్వంపై అవగాహన కల్పిస్తూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కోర్టు ప్రాంగణం నుంచి ఒంగోలు చర్చి సెంటర్ వరకు సాగిన ఈ ర్యాలీని ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎ.సత్యానంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఎంతో ఉపయోగకరమైన విధానమన్నారు. దీనిద్వారా సమయం, ఖర్చు ఆదా కావడంతో పాటు ఇరుపక్షాల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొంటుందన్నారు. ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు ప్రజలకు దీనిపై విస్తృత అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఒకటో అదనపు జిల్లా న్యాయమూర్తి టి.రాజ్యలక్ష్మి, ఇతర అదనపు జిల్లా న్యాయమూర్తులు, సీనియర్, జూనియర్ సివిల్ జడ్జిలు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చావలి రమేష్ బాబు, మధ్యవర్తిత్వ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మధ్యవర్తిత్వం ఉత్తమ మార్గం
మార్కాపురం: వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఉత్తమమైన మార్గమని జిల్లా ఆరవ అదనపు న్యాయమూర్తి వి.భవానీ అన్నారు. గురువారం మార్కాపురం కోర్టు ప్రాంగణం నుంచి ప్రెస్‌క్లబ్, కంభం సెంటరు మీదుగా పాతబస్టాండు గడియార స్తంభం సెంటరు వరకూ మధ్యవర్తిత్వంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సబ్ జడ్జి బి.దేవేందర్‌రెడ్డి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్‌జడ్జి జె.కిశోర్‌కుమార్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఎం.బాలాజీ, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ డి.శాంతాకుమారి, సీఐ అల్తాఫ్ హుస్సేన్, బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎస్.మాబూఆలీ, న్యాయవాది షేక్ జహీర్ సలామ్ తదితరులు పాల్గొన్నారు.


