వైఎస్సార్‌ సీపీ బీసీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పీఎల్‌పీ యాదవ్‌ | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ బీసీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పీఎల్‌పీ యాదవ్‌

Aug 7 2026 2:14 AM | Updated on Aug 7 2026 2:14 AM

వైఎస్సార్‌ సీపీ బీసీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పీఎల్‌పీ యాదవ్‌ దివ్యాంగ విద్యార్థినికి ఎస్‌బీఐ చేయూత

మార్కాపురం: వైఎస్సార్‌సీపీ బీసీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మార్కాపురం పట్టణానికి చెందిన న్యాయవాది పిన్నిక లక్ష్మీప్రసాద్‌ యాదవ్‌ (పీఎల్‌పీ యాదవ్‌), ఐటీ వింగ్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా కె.వి.నారాయణరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. పార్టీ కోసం కష్టపడే వారికి గుర్తింపు దక్కడం పట్ల పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ వారిని అభినందించారు. తమ నియామకానికి సహకరించిన మార్కాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు పీఎల్‌పీ యాదవ్‌, నారాయణరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

త్రిపురాంతకం: రాష్ట్ర స్థాయి పారా ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన దివ్యాంగ విద్యార్థిని డోల అనూషకు త్రిపురాంతకంలోని ఎస్‌బీఐ సిబ్బంది గురువారం చేయూత అందించారు. పుట్టుకతోనే అంధురాలైన అనూష.. ఆటలతో పాటు చదువుపై శ్రద్ధ చూపుతుండటంతో మెరుగైన విద్య కోసం ఐఈఆర్టీ సిబ్బంది బాలవిజయ, నజీర్‌ చొరవ తీసుకున్నారు. ఆమెను ఏలూరు జిల్లా అగిరిపల్లి మండలంలోని హిల్‌ ప్యారడైజ్‌ స్కూల్‌లో చేర్పించారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్‌బీఐ బ్రాంచ్‌ మేనేజర్‌ అలవాల శ్రీనివాసరావు, డిప్యూటీ మేనేజర్‌ శ్రీనుబాబు, క్యాష్‌ ఆఫీసర్‌ శివారెడ్డి.. ఆ విద్యార్థినికి అవసరమైన బ్యాగులు, బెడ్‌షీట్లు, నిత్యావసర వస్తువులను అందజేశారు. కార్యక్రమంలో ఎంఈవోలు కె.మల్లికార్జున నాయక్‌, తేలుకుట్ల రాజశేఖరరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement