● రెండు కాళ్లు తెగిపోయిన వైనం
అద్దంకి: రోటావేటర్‌లో పడి ప్రమాదవశాత్తు ఓ రైతు తన రెండు కాళ్లను కోల్పోయిన హృదయవిదారక ఘటన అద్దంకి మండలంలోని కలవకూరులో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చిట్టిబోయిన వెంకట్రావు తన పొలంలో రోటావేటర్‌తో దుక్కి దున్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ట్రాక్టర్ మీద కూర్చుని ఉండగా, ప్రమాదవశాత్తు జారి కింద పడటంతో రెండు కాళ్లు రోటావేటర్ బ్లేడ్లలో పడి తెగిపోయాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రుడికి ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో నరసరావుపేట ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు బంధువులు తెలిపారు. కష్టపడి పనిచేసుకునే రైతుకు ఇలాంటి దుస్థితి పట్టడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


