కనిగిరి రూరల్: సైబర్ కేటుగాళ్లు రోజుకో తరహాలో ప్రజలకు టోకరా వేస్తున్నారు. కనిగిరిలో ఇప్పటికే సైబర్ కేటుగాళ్ల ఉచ్చులో పలువురు చిక్కుకుని నష్టపోయి ఉన్నారు. తాజాగా కనిగిరి మున్సిపాలిటీలో ఫీజుల వసూళ్ల పేరుతో పట్టణ వ్యాపారస్తులు, దుకాణదారులు, లాడ్జి యజమానులు, హాస్పిటల్స్ వారిని సైబర్ నేరగాళ్లు ట్రాప్‌లో వేసేందుకు పన్నాగం పన్నారు. ఒకరిద్దరు ట్రాప్‌లో చిక్కుకుని వెంటనే అప్రమత్తమైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. సైబర్ నేరగాళ్లు వాట్సాప్ క్యూ ఆర్ కోడ్‌లు పంపి నగదు వసూలు చేసేందుకు ప్రయత్నించారు. పట్టణంలోని గార్లపేట రోడ్డులోని ఓ ప్రైవేటు హాస్పిటల్ డాక్టర్‌కు, ఓ లాడ్జి యజమానికి కూడా సైబర్ నేరగాళ్ల ఫోన్ చేశారు. వెంటనే వారికి అనుమానం వచ్చింది. ఇది సైబర్ నేరగాళ్ల మోసంగా భావించి అప్రమత్తమాయ్యరు. ఎలాంటి నగదు చెల్లించకుండా వారి వాయిస్ రికార్డు చేశారు. ఓ రెస్టారెంట్, ఓ హోటల్ యజమాని మాత్రం నమ్మి క్యూర్ కోడ్‌కు కొంత నగదు పంపినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో కొందరు వ్యక్తులు వెంటనే మున్సిపల్ అధికారులను సంప్రదించారు. తాము ఎటువంటి ఫోన్లు చేయలేదని సిబ్బంది, అధికారులు స్పష్టం చేశారు. దీంతో అది సైబర్ నేరగాళ్ల పనిగా భావించి అందరూ అప్రమత్తమయ్యారు.
ఫేక్ వసూళ్లపై అప్రమత్తంగా ఉండాలి : కమిషనర్ శ్రీధర్
కనిగిరిలో ట్రైడ్ లైసెన్స్ ఫీజు పేరుతో ఫోన్ చేసి స్కానర్ పెట్టి సైబర్ నేరగాళ్లు డబ్బులు వసూలు చేస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ పర్వతనేని శ్రీధర్ సూచించారు. సైబర్ నేరగాళ్ల మోసాల ట్రాప్‌లో పడకుండా జాగ్రత్త వహించాలన్నారు. ట్రైడ్ లైసెన్స్ ఫీజులు జనవరి, ఫిబ్రవరిలోనే అధికారికంగా వసూలు చేస్తామని, ప్రస్తుతం ఎలాంటి వసూళ్లు లేవని స్పష్టం చేశారు. ఇంటి పన్నులు, వగైరా పన్నుల విషయంలో అనుమానాస్పద కాల్ వచ్చినా.. డబ్బులు అడిగినా.. వారిపై ఎటువంటి అనుమానం కలిగినా.. వెంటనే మున్సిపల్ కార్యాలయం నంబర్ 79939 37001కు కాల్ చేయాలని, లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని పట్టణ ప్రజలు, వ్యాపారులకు కమిషనర్ సూచించారు.
మార్కాపురం: 18 ఏళ్లు నిండిన యువతీ యువకులందరికీ ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ చెల్లించాలని సీపీఎం ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట రిలే దీక్షలు చేపట్టారు. వేల కోట్లు వెచ్చించి ప్రాజెక్టు నిర్మిస్తున్నా ప్రాజెక్టు నిర్వాసితులపై ఖర్చు నామమాత్రమేనన్నారు. వెంటనే నిర్వాసితులందరికీ న్యాయమైన ఆర్‌అండ్‌ఆర్ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టును జాతికి అంకితం చేసే నాటికి 18 ఏళ్ల వయసు నిండిన యువతి, యువకులందరికీ ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ చెల్లించాలని నిర్వాసితుల సంఘం కో కన్వీనర్ దగ్గుపాటి సోమయ్య సోమవారం ఆర్డీఓ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా సోమయ్య మాట్లాడుతూ ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితుల పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా ఉండటం దారుణమన్నారు. ఈ సందర్భంగా పరిహారం చెల్లించాలని నిర్వాసితులతో కలిసి నినాదాలు చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గుమ్మా బాలనాగయ్య, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీకేఎం రఫీ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కె. విజయ్‌కుమార్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు డి.వందన్ కుమార్, బొల్లవరం మల్లికార్జున, మండ్ల అనిల్, పెద్ద పాండు, రంగసాయులు, యశ్వంత్, అంజి, భీమవరం ప్రసాద్, దూదేకుల ఖాశీంపీరా, మద్దూరి శశింద్ర పాల్గొన్నారు.
సైబర్ నేరగాళ్లు వాడిన స్కానర్లు..
కనిగిరిలో
వెలుగుచూసిన మోసం


