జిల్లాలో ప్రస్తుతం ఉన్న పోలింగ్ కేంద్రాలు 1103 పెంపునకు ప్రతిపాదించినవి 42 మొత్తం కలిపి 1147 పోలింగ్ కేంద్రాలు
మార్కాపురం టౌన్ వ్యూ
మార్కాపురం:
నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలో పోలింగ్ కేంద్రాలు పెరగనున్నాయి. ఇందుకు అధికారులు ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపారు. జిల్లాలో మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాలు ఉండగా వీటి పరిధిలో మొత్తం 21 మండలాలు ఉన్నాయి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కార్యక్రమంలో భాగంగా జిల్లాల్లో పోలింగ్ కేంద్రాల పునర్ వ్యవస్థీకరణకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. 1,200 మంది ఓటర్ల కంటే ఎక్కువ ఉన్న వాటిని సవరిస్తూ కొత్తగా పోలింగ్ కేంద్రాలకు ప్రతిపాదనలు పంపాలని సూ చించింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని మార్కాపురం, యర్రగొండపాలెం, కనిగిరి, గిద్దలూరు నియోజకవర్గాల్లో 42 కొత్త పోలింగ్ కేంద్రాలకు అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. ప్రస్తుతం 1103 కేంద్రాలు ఉండగా 42 పెరగటం ద్వారా మొత్తం 1145 అవ్వనున్నాయి. మార్కాపురంలో 2, కనిగిరిలో 1 పోలింగ్ కేంద్రం లొకేషన్ మార్పు కోసం ప్రతిపాదించారు. గిద్దలూరు నియోజకవర్గంలో 10 మంది ఒక పోలింగ్ కేంద్రం నుంచి మరొక పోలింగ్ కేంద్రానికి మార్చాలని కోరటంతో దానికి కూడా నివేదిక తయారు చేశారు.
జిల్లాలో పోలింగ్ కేంద్రాల వివరాలు
నియోజకవర్గం ప్రస్తుతం పెరిగేవి మొత్తం
మార్కాపురం 257 20 277
గిద్దలూరు 284 3 287
యర్రగొండపాలెం 265 2 267
కనిగిరి 297 17 314
మొత్తం 1103 42 1145


