మార్కాపురం: రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్‌టీయూ) ఆధ్వర్యంలో నిష్ణాతులైన ఉపాధ్యాయులచే ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయుల టెట్ (పేపర్–1ఏ) పరీక్షల కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్టడీ మెటీరియల్‌ను మార్కాపురం జిల్లా విద్యాశాఖ అధికారి సామ సుబ్బారావు ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ ఎస్‌టీయూ రూపొందించే ప్రతి స్టడీ మెటీరియల్ ఉపాధ్యాయులు ఉపయోగించుకోవాలన్నారు. ఎస్‌టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్రయ్య మాట్లాడుతూ టెట్ పేపర్–1ఏకు సంబంధించిన తెలుగు, ఇంగ్లిష్, సైకాలజీ, మెథడాలజీలపై సమగ్రంగా స్టడీ మెటీరియల్ రూపొందించామని తెలిపారు. త్వరలో పేపర్–1ఏ అభ్యర్థుల కోసం ఆఫ్‌లైన్ మోడల్ పరీక్షలను కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మార్కాపురం జిల్లా అసిస్టెంట్ ఎగ్జామినేషన్ కమిషనర్ కొండారెడ్డి, డీసీఈబీ కార్యదర్శి ఎం.సుధాకర్, బంగారు బాల్యం కన్వీనర్ గిరిధర్ శర్మ, గిద్దలూరు ఎంఈఓ అశ్విని కుమార్, సీహెచ్ గాలయ్య, యూసఫ్ షరీఫ్, అక్కల నారాయణ, వెంకటరమణ, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.


