పొగచూరిన
రాష్ట్రంలో పొగాకు రైతుల కష్టాలు తీరడం లేదు. ధరలు రోజురోజుకూ పతనమవుతున్నాయి. సగటు ధర కిలోకి రూ.200 లోపే పలుకుతోంది. వేలం కేంద్రాల వద్ద తిరస్కరణలు(నోబిడ్) ఎక్కువగా ఉండడంతో రైతులు దిగాలు పడుతున్నారు. వేలం ప్రారంభమై దాదాపు 90 రోజులు గడుస్తున్నా పరిస్థితిలో మార్పురాకపోవడంతో రైతుల్లో ఆందోళన పెరుగుతోంది.
వేలం కేంద్రాల్లో అన్యాయం జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రైతులకు
మద్దతుగా వైఎస్సార్ సీపీ ఆందోళనలు చేపడుతోంది. ఇందులో భాగంగా గురువారం
కనిగిరి ఆర్డీఓ కార్యాలయం ఎదుట పార్టీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపడుతున్నారు.


