● అధికారులను ఆదేశించిన జేసీ కల్పనా కుమారి
ఒంగోలు సబర్బన్: గ్రంథాలయాభివృద్ధికి తోడ్పడాలని, సకాలంలో గ్రంథాలయ సెస్ సంస్థకు అందేలా కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి సంబంధిత విభాగాల అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన కలెక్టరేట్‌లో మంగళవారం గ్రంథాలయ సెస్ అభివృద్ధి కమిటీ సమావేం నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రంథాలయానికి రావాల్సిన బకాయిలు త్వరలో జమ చేయాలని కమిటీ సభ్యులుగా ఉన్న జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా ఆడిట్ అధికారి, ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, అన్ని మున్సిపాలిటీల కమిషనర్లు, ఇతర అధికారులను ఆదేశించారు. సమావేశానికి కన్వీనర్‌గా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కె.సుధాకర్ రావు పాల్గొన్నారు.
ఒంగోలు సిటీ: కాపు ఉద్యమ నాయకుడు మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముద్రగడ పద్మనాభం మృతి పార్టీకి తీరనిలోటని పలువురు పార్టీ నాయకులు సంతాపం తెలిపారు. దర్శి ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, పార్టీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు నియోజకవర్గం ఇన్‌చార్జి చుండూరి రవిబాబు, ఒంగోలు నియోజకవర్గ పరిశీలకులు వై వెంకటేశ్వర్లు ముద్రగడ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.


