మాజీ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి | - | Sakshi
Sakshi News home page

మాజీ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి

Jul 14 2026 4:35 AM | Updated on Jul 14 2026 4:35 AM

ఒంగోలు టౌన్‌: మాజీ కానిస్టేబుల్‌పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడిచేసిన సంఘటన కలకలం సష్టించింది. పోలీసుల కథనం ప్రకారం... నగరంలోని కేశవస్వామిపేటకు చెందిన కొప్పుల సాయికుమార్‌ గతంలో కానిస్టేబుల్‌గా పనిచేయగా, వివిధ కారణాలతో సర్వీసు నుంచి రిమూవ్‌ చేశారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2.30 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కొందరు నగరంలోని కృష్ణుడి విగ్రహం వద్ద శివాలయం సెంటర్లో సాయికుమార్‌పై దాడి చేశారు. ఈ దాడిలో సాయి కుమార్‌కు తీవ్రగాయాలయ్యాయి. రాత్రి 3 గంటల సమయంలో సాయికుమార్‌ను ఎవరో కొట్టి పడేసి వెళ్లారని దండే దినేష్‌ అనే వ్యక్తి సాయి కుమార్‌ వదిన మల్లీశ్వరికి ఫోన్‌ చేసి చెప్పాడు. ఆమె వెళ్లేసరికే అతడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సాయి కుమార్‌ అపస్మారక స్థితిలో ఉన్నాడు. ప్రస్తుతం ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

మల్లీశ్వరి ఫిర్యాదు మేరకు ఒంగోలు వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పేకాట గొడవలే ఈ దాడికి కారణమని ప్రచారం జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement