బూచేపల్లి వైద్య శిబిరానికి విశేష స్పందన | - | Sakshi
Sakshi News home page

బూచేపల్లి వైద్య శిబిరానికి విశేష స్పందన

Jul 14 2026 4:35 AM | Updated on Jul 14 2026 4:35 AM

కమలాకర్‌రెడ్డి చిత్రపటానికి నివాళులర్పిస్తున్న బూచేపల్లి వెంకాయమ్మ, బూచేపల్లి శివప్రసాదరెడ్డి, మేరుగు నాగార్జున, బత్తుల బ్రహ్మానందరెడ్డి, కొమ్మూరి కనకారావు, కసుకుర్తి ఆదెన్న, వేమా శ్రీనివాసరావు తదితరులు

రోగులకు మందులు పంపిణీ చేస్తున్న బూచేపల్లి వెంకాయమ్మ, బూచేపల్లి శివప్రసాదరెడ్డి, మేరుగు నాగార్జున

చీమకుర్తి: బూచేపల్లి చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో సోమవారం చీమకుర్తిలో నిర్వహించిన ఉచిత మెగా కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. చీమకుర్తితో పాటు చుట్టుపక్కల గ్రామాలు, మండలా ల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చి సద్వినియోగం చేసుకున్నారు. సినీ హీరో బూచేపల్లి కమలాకర్‌రెడ్డి 13వ వర్ధంతి సందర్భంగా గుంటూరు పెదకాకాని లోని శంకర నేత్రాలయ వారి సహకారంతో నిర్వహించగా, వైద్య పరీక్షల కోసం 1700 మందికిపైగా హాజరయ్యారు. వారిలో కంటి ఆపరేషన్‌లు అవసరమైన 600 మందిని ఎంపిక చేసినట్లు బూచేపల్లి ట్రస్ట్‌ తెలియజేసింది. బూచేపల్లి చారిటబుల్‌ ట్రస్ట్‌ తరఫున ఏర్పాటు చేసిన 12వ ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని కమలాకర్‌రెడ్డి తల్లి, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, కమలాకర్‌రెడ్డి సోదరుడు బూచేపల్లి శివప్రసాదరెడ్డి, డాక్టర్‌ బీ జవహర్‌ ప్రారంభించారు. వైఎస్సార్‌ సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున, గిద్దలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి అన్నా రాంబాబు, ఒంగోలు పార్లమెంట్‌ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కమలాకర్‌రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని బూచేపల్లి చారిటబుల్‌ ట్రస్ట్‌ తరఫున ప్రతి ఏటా నిర్వహిస్తున్న ఉచిత మెగా కంటి వైద్యశిబిరం ద్వారా వందలాది మంది రోగులకు వైద్య సదుపాయం కల్పించడం అభినందనీయమని కొనియాడారు. గత 12 సంవత్సరాలుగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వేలాది మందికి కంటి ఆపరేషన్లు చేయించటం బూచేపల్లి కుటుంబం మానవీయతకు నిదర్శనమని ప్రశంసించారు. తొలుత బూచేపల్లి కమలాకర్‌రెడ్డి పార్కులోని స్మారకం వద్ద కమలాకర్‌రెడ్డి చిత్రపటానికి గజమాలలతో బూచేపల్లి వెంకాయ మ్మ, బూచేపల్లి శివప్రసాదరెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. బూచేపల్లి కల్యాణ మండపం వద్ద కమలాకర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి వైద్యశిబిరానికి వచ్చిన రోగులతో పాటు వైఎస్సార్‌ సీపీకి చెందిన దాదాపు 6 వేల మంది పాల్గొన్నారు. కంటి ఆపరేషన్‌లకు ఎంపికై న 600 మందిని దశల వారీగా శంకర నేత్రాలయకు తీసుకెళ్లి ఉచితంగా ఆపరేషన్లు చేయించి మందులు కూడా ఉచితంగా అందించి తిరిగి చీమకుర్తిలోని బూచేపల్లి కల్యాణ మండపం వద్దకు చేర్చనున్నట్లు బూచేపల్లి ట్రస్ట్‌ నిర్వాహకులు తీసుకున్నారు. ఆపరేషన్‌లు అవసరం లేని వారికి కూడా ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ కొమ్మూరి కనకారావు, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, ఎంపీపీ యద్దనపూడి శ్రీనివాసరావు, జెడ్పీటీసీ సభ్యుడు వేమా శ్రీనివాసరావు, వైఎస్సార్‌ సీపీ చీమకుర్తి పట్టణ అధ్యక్షుడు క్రిష్టిపాటి శేఖరరెడ్డి, సంతనూతలపాడు మండల అధ్యక్షుడు దుంపా చెంచిరెడ్డి, నాయకులు మన్నం శ్రీధర్‌, చిన్నపురెడ్డి మస్తాన్‌రెడ్డి, బీసీసెల్‌ జిల్లా అధ్యక్షుడు తెల్లమేకల గాంధీ, మొగిలిశెట్టి వెంకటేశ్వర్లు, బీమన వెంకట్రావు, తప్పెట బాబూరావు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

1700 మందికిపైగా హాజరు

కంటి ఆపరేషన్‌లకు 600 మంది ఎంపిక

బూచేపల్లి కమలాకర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా బూచేపల్లి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్వహణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement