కనిగిరి రూరల్: పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైఎస్సార్ సీపీ కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ విమర్శించారు. వైఎస్సార్ సీపీ నాయకులు, రైతులతో కలిసి కనిగిరిలోని పొగాకు వేలం కేంద్రాన్ని సోమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు వారికి జరుగుతున్న అన్యాయం, నష్టం గురించి దద్దాల నారాయణ దృష్టికి తీసుకొచ్చారు. రైతులకు న్యాయం చేయాలంటూ పొగాకు బోర్డు సూపరింటెండెంట్‌తో దద్దాల నారాయణ యాదవ్ మాట్లాడారు. గిట్టుబాటు ధరలు, బేళ్ల కొనుగోలు, నో బిడ్‌లు, తదితర అంశాలపై చర్చించారు. అనంతరం దద్దాల నారాయణ యాదవ్ మాట్లాడుతూ కూటమి సర్కార్‌లో ఏ పంటకూ గిట్టుబాటు, మద్ధతు ధరలు దక్కడం లేదన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రైతులకు అన్ని విధాలుగా మేలు జరిగిందన్నారు. పొగాకు పంటను మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయించి ఆనాటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతులను ఆదుకున్నారని చెప్పారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో అందుకు భిన్నంగా జరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో పొగాకు రైతులకు న్యాయం చేయాలని, గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరుతూ ఈ నెల 16వ తేదీ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రైతు దీక్ష కార్యక్రమం నిర్వహించనున్నట్లు దద్దాల వెల్లడించారు. రైతులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఎస్‌కే అబ్దుల్‌గఫార్, పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి సూరసాని మోహన్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి గాండ్లపర్తి ఆదినారాయణరెడ్డి, నాయకులు కటికల వెంకటరత్నం, యక్కంటి శ్రీనివాసులరెడ్డి, పోలక సిద్దారెడ్డి, పిల్లి లక్ష్మీనారాయణరెడ్డి, మండాది కృష్ణారెడ్డి, దాదిరెడ్డి మాలకొండారెడ్డి, ఆయిమల్ల నాగమణి, ప్రత్తి సురేష్‌రెడ్డి, పలుకూరి భాస్కర్, సూరసాని చంద్రశేఖర్‌రెడ్డి, రేగుల బాలయ్య చౌదరి, సూరసాని చినకాశిరెడ్డి, గోబ్బిళ్ల శ్రీను, కల్లూరి రవీంద్రారెడ్డి, ఎస్‌కే మహాబూబ్ బాషా, పాపాబత్తిన నాగేశ్వరరావు, మారం వెంకటేశ్వరరెడ్డి, బచ్చు వెంగళరావు గుప్తా, రాచర్ల నరేష్ గుప్తా, ఇండ్లా శ్రీకాంత్, ఇండ్లా భాను, సుస్మిత తదితరులు పాల్గొన్నారు.
పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో ఘోర వైఫల్యం
కనిగిరి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించిన వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి దద్దాల నారాయణయాదవ్
కనిగిరిలో 16న పొగాకు రైతు దీక్షను విజయవంతం చేయాలని పిలుపు


