మార్కాపురం టౌన్: సర్ ప్రక్రియలో భాగంగా జరుగుతున్న ఎన్యూమరేషన్ డిజిటైజేషన్ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎం.విజయ సునీత బీఎల్‌ఓలను ఆదేశించారు. మార్కాపురం పట్టణంలోని డ్రైవర్స్ కాలనీ, జవహర్ నగర్ కాలనీ, నాయుడు బజార్ బజార్, తర్లపాడు రోడ్ లోని రామిరెడ్డి బజార్ తదితర ప్రాంతాల్లో ఆదివారం సర్ కార్యక్రమంలో జరుగుతున్న డిజిటైజేషన్ ప్రక్రియను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యంగా బీఎల్వోలు తమ వద్ద ఉన్న క్లెయిమ్స్ పెండింగ్‌లో ఉంచుకోవద్దన్నారు. కచ్చితంగా వస్తారు అనుకున్న వారికి ఫోన్ చేసి వివరాలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రక్రియను ఈరోజు సాయంత్రం కల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.


