● కొత్త బైకును బాబాయ్‌కు చూపించాలని వేగంగా వంతెను ఢీకొట్టడంతో ప్రమాదం
సంతనూతలపాడు(చీమకుర్తి): ‘కొత్త బైక్..బాబాయ్‌కి చూయించాలనే ఉత్సాహంతో తెల్లవారుజామున 4 గంటలకు అతివేగంతో వెళుతూ నిర్మాణంలో ఉన్న ఢీకొట్టడంతో తీవ్ర రక్తస్రావమై యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన సంతనూతలపాడు సమీపంలో జరిగింది. వివరాల్లోకి వెళితే...సంతనూతలపాడుకు చెందిన క్రాంతికుమార్(20) హైదరాబాద్‌లో బేల్దార్ పనులు చేస్తుంటాడు. శనివారం కొత్త బైకును కొన్నాడు. ఆ బైక్‌పై ఆదివారం తెల్లవారుజామున ఒంగోలు నుంచి సంతనూతలపాడు బయలుదేరాడు. ఈ క్రమంలో సంతనూతలపాడు శివారులో ఒంగోలు వైపు వచ్చే కర్నూల్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న వంతెనను చీకట్లో గుర్తించలేదు. కొత్త బండి కావడంతో వేగంగా వస్తూ ఉండటంతో నిర్మాణంలో ఉన్న వంతెన వద్ద ఎలాంటి హెచ్చరికలు సక్రమంగా లేకపోవడంతో వంతెన మొదటి గోడను ఢీకొట్టాడు. వేగం తీవ్రతకు వంతెనకు చివరలో ఉన్న నాలుగో గోడ కల్వర్టులో ఎగిరి పడ్డాడు. గోడలకు ఇనుప చువ్వలతో కాంక్రీట్ పోస్తూ నాలుగు గోడలను నిర్మిస్తున్నారు. గోడలకు ఉన్న చువ్వలు గుచ్చుకోవడం, సుమారు 7–8 అడుగులు ఎగిరి పడటంతో శరీరానికి తీవ్ర గాయాలు కావడం, చీకట్లో ఎవరూ చూడకపోవడంతో తీవ్ర రక్త స్రావమై మృతి చెందాడు. బైకు రోడ్డు మీద పక్కకు పడి నుజ్జునుజ్జయింది. ఎస్సై అజయ్‌బాబు వివరాలను సేకరిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


