మితి మీరిన వేగం, మద్యం మత్తులో వాహనాలు నడపటం వల్ల అధికంగా ప్రమాదాలు జరుగుతుంటాయి. తెల్లవారు జామున 3 నుంచి 4 గంటల సమయంలో నిద్రమత్తులో కూడా ప్రమాదాలు జరిగి పలువురు ప్రాణాలు కోల్పోయిన సందర్బాలున్నాయి. ఈ నెల 3వ తేదీ అర్థరాత్రి కంభంలో హైవే రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గిద్దలూరుకు చెందిన నలుగురు మృత్యువాత పడగా, అంతకు ముందు జంగంగుంట్ల తిప్పాయపాలెం మద్యలో జరిగిన ఓ ప్రమాదంలో కర్ణాటకకు చెందిన ముగ్గురు మృత్యువాత పడ్డారు, జంగంట్లలో హైవే బస్సును ఢీకొని అర్థవీడు మండలానికి చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు, ఇలా ఇటీవల హైవే రోడ్డు పై ఘోర రోడ్డు ప్రమాదాలు జరుగుతూ రహదారి రక్తసిక్తమవుతుంది. వీటితో పాటు కంభం– గిద్దలూరు, చిన్నకంభం– బేస్తవారిపేట, కంభం– తర్లుపాడు రోడ్డులో పలు ప్రమాదాలు జరిగి పలువురు మృత్యువాత పడిన సంఘటనలు ఇటీవల కాలంలో జరిగాయి.


