16న కనిగిరిలో పొగాకు రైతు దీక్ష | - | Sakshi
Sakshi News home page

16న కనిగిరిలో పొగాకు రైతు దీక్ష

Jul 12 2026 3:35 AM | Updated on Jul 12 2026 3:35 AM

కనిగిరి రూరల్‌: పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్‌ సీపీ కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ దద్దాల నారాయణ యాదవ్‌ ధ్వజమెత్తారు. వైఎస్సార్‌ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో.. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, మార్క్‌ఫెడ్‌ ద్వారా రూ.500 కోట్లు కేటాయించి ప్రభుత్వమే పొగాకు కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ.. ఈ నెల 16వ తేదీ ఉదయం కనిగిరిలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద పొగాకు రైతు దీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. రైతులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతూ స్థానిక పార్టీ ఆఫీసులో పార్టీ నేతలు, రైతు నాయకులతో కలిసి శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దద్దాల నారాయణ యాదవ్‌ మాట్లాడుతూ వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో రైతు వర్గాలు సంతోషంగా ఉన్నాయన్నారు. ఆనాటి సీఎం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతుల సంక్షేమానికి ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు. పొగాకు రైతులకు గిట్టుబాటు, మద్దతు ధరలు లభించి ఎంతో ఆనందంగా ఉన్నారన్నారు. ఆనాడు కనిగిరి ప్రాంతంలోని టుబాకో బోర్డు పరిధిలో 7.5 మిలియన్‌ కేజీల పొగాకు ఉత్పత్తి కాగా, ఆ మొత్తాన్ని కంపెనీలు కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని వివరించారు. రైతుకు కేజీ గరిష్ట ధర రూ.350 నుంచి రూ.360 వరకు ఇచ్చారని, కనిష్ట ధర రూ.270 నుంచి రూ.280 వరకు ఇచ్చారని గుర్తు చేశారు. చంద్రబాబు సర్కార్‌ అధికారంలోకి వచ్చాక పొగాకు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారిందని విమర్శించారు. రైతుకు కనీస పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదన్నారు. రైతులు రోడ్లెక్కి రాస్తారోకోలు చేస్తున్నా తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. పొగాకు బేళ్లను కొనుగోలు చేయక, గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతున్నారని తెలిపారు. కంపెనీల బయ్యర్లు, అధికారులు కుమ్మకై ్క పొగాకు రైతులకు అన్యాయం చేస్తున్నా ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదన్నారు. రెండేళ్ల నుంచి పొగాకు రైతుకు సరైన ధర లేదన్నారు. పొగాకు రైతుల సమస్యలపై చేపట్టిన రైతు దీక్ష కార్యక్రమంలో నియోజకవర్గంలోని రైతులంతా అధిక సంఖ్యలో పాల్గొనాలని దద్దాల పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ ఎస్‌కే అబ్దుల్‌ గఫార్‌, జెడ్పీటీసీ సభ్యుడు మడతల కస్తూరిరెడ్డి, ఓకే రెడ్డి, రైతు సంఘ జిల్లా కార్యదర్శి సూరసాని మోహన్‌రెడ్డి, మాజీ వైస్‌ చైర్మన్‌ రాచపుడి మాణిక్యరావు, గోపవరపు బొర్రారెడ్డి, గాండ్లపర్తి ఆదినారాయణరెడ్డి, సిరుపవెంకట గోవర్దన్‌రెడ్డి, పిల్లి లక్ష్మీనారాయణరెడ్డి, మూలే గోపాల్‌రెడ్డి, డాక్టర్‌ ఆవుల కృష్ణారెడ్డి, వాకమల్ల రాజశేఖర్‌రెడ్డి, బత్తుల మాలి, యరబ్రల్లి దేవరాజు, పలుకూరి భాస్కర్‌, ఎస్‌కే మీరావలి, వంటిపెంట శివకృష్ణారెడ్డి, సూరసాని చంద్రశేఖర్‌రెడ్డి, దాదిరెడ్డి మాలకొండారెడ్డి, ప్రత్తి సురేష్‌రెడ్డి, సూరసాని చిన్న కాశిరెడ్డి, శిగా కృష్ణారావు, పల్నాటి భాస్కర్‌రెడ్డి, భూమిరెడ్డి కొండారెడ్డి, దర్శి ఫణికుమార్‌, బచ్చు వెంగళరావు గుప్తా, దర్శి సుబ్రహ్మణ్యం, మూలే రాజశేఖర్‌రెడ్డి, పాతకొట్టు పిచ్చిరెడ్డి, దమ్ము వెంకటయ్య, ఓంకార్‌, ద్రోణాదుల చెంచులు, ద్రోణాల మధుసూదన్‌రావు, కాసుల బాలగురవయ్య, బాపట్ల కొండలరావు, కన్నేటి సుబ్బారెడ్డి, పైడాల రామ్మోహన్‌రెడ్డి, ఎస్‌కే పీరా హుస్సేన్‌, తిరుమలపూడి మహేష్‌, మూలే మాల్యాద్రిరెడ్డి, ఎస్‌కే మహబూబ్‌బాషా, పిల్లి రఘురామిరెడ్డి, యా బేజ్‌, ముద్దా పౌలు తదితరులు పాల్గొన్నారు.

రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి దద్దాల పిలుపు

పొగాకు రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు సర్కార్‌ విఫలమైందని ధ్వజం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement