పల్నాడు నుంచి గడ్డి కొన్నా
మర్రిపూడి: మండలంలో పనిచేస్తున్న ఇద్దరు బీఎల్‌ఓలపై కలెక్టర్ రాజాబాబు సస్పెన్షన్ వేటు వేసినట్లు తహశీల్దార్ జనార్దన్ శుక్రవారం తెలిపారు. మండలంలోని కూచిపూడి 28వ బూత్‌లో 1050 మంది ఓటర్లు ఉన్నారు. అయితే వెల్ఫేర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వీ నరేంద్రబాబును 28వ బూత్‌కు బీఎల్‌ఓగా నియమించారు. నరేంద్ర ఓటర్లకు సంబంధించిన దరఖాస్తుల పంపిణీలో నిర్లక్ష్యం వహించాడని ఈఆర్‌ఓ రవికుమార్ గుర్తించి, ఉన్నతాధికారులకు నివేదించాడు. అలాగే మర్రిపూడి పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న బీవీ నాయుడుకు మండలంలోని 22వ పోలింగ్ బూత్ అధికారిగా అదనపు బాద్యతలు ఇచ్చారు. పీఎస్ నాయుడుకు రేగలగడ్డ, దుగ్గిరెడ్డిపాలెం, పొట్టిరెడ్డిపాలెం గ్రామాలను అప్పగించారు. ఈ గ్రామాల్లో 1163 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 293 దరఖాస్తులను డిజిటలైజేషన్ (25.19 శాతం) చేశారు. విధి నిర్వహణలో అలసత్వం వహించారని ఈఆర్‌ఓ రవికుమార్ గుర్తించి నివేదికను కలెక్టర్ రాజాబాబుకు పంపారు. దీంతో కలెక్టర్ ఇద్దరు బీఎల్‌ఓలను సస్పెండ్ చేశారు. రేగలగడ్డ 22 వ బూత్‌కు మర్రిపూడి గ్రామ వ్యవసాయ సహాయకుడు చిరంజీవిని, అలాగే కూచిపూడి 28వ పోలింగ్ బూత్‌కు ఇంజనీర్ అసిస్టెంట్ కే మాలకొండయ్యను నియమించినట్లు తహశీల్దార్ జనార్దన్ తెలిపారు.
మార్కాపురం రూరల్: జిల్లా కేంద్రమైన మార్కాపురం మండలంలోని పెద్ద యాచవరం, రాజుపాలెం, పెద్ద నాగులవరం గ్రామాల్లో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో రాజకీయ జోక్యం పెరుగుతోంది. కొందరు టీడీపీ నాయకులు బీఎల్‌వోలపై ఒత్తిడి తెస్తున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. తటస్థ ఓటర్లు, వైఎస్సార్ సీపీ సానుభూతిపరులకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాలను తమకు అందజేస్తే వాటిని తమ యాప్‌లో అప్‌లోడ్ చేస్తామని బీఎల్‌వోలపై ఒత్తిడి తీసుకొచ్చారని ఆరోపిస్తున్నారు. అయితే బీఎల్‌వోలు అందుకు అంగీకరించకపోవడంతో వారిని బెదిరిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఎన్నికల అధికారులు స్పందించి, ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా స్వేచ్ఛగా విధులు నిర్వహించేలా బీఎల్‌వోలకు రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.
మార్కాపురం:
ఉమ్మడి జిల్లాలో రైతులకు వ్యవసాయం తర్వాత పాడి పరిశ్రమే ప్రధాన ఆదాయ వనరు. రైతులు పాడి గేదెలను కన్నబిడ్డల్లా చూసుకుంటారు. ఉమ్మడి జిల్లాలో వేలాది మంది పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో పొలాల్లో పచ్చిగడ్డి లేదు. గడ్డి కొరతతో పశువులకు సరిపడా మేత అందకపోవడంతో పాల ఉత్పత్తి క్రమంగా తగ్గుతోంది. గతంలో రోజుకు ఇచ్చిన పాలతో పోల్చితే ప్రస్తుతం పశువులు తక్కువ పాలు ఇస్తున్నాయని, గడ్డి కొరతే కారణమని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడ్డి ధరలు విపరీతంగా పెరగడంతో పశుపోషణ వ్యయం భారీగా పెరిగింది. ఒక వైపు పశుగ్రాసం ఖర్చు, మరోవైపు పాలదిగుబడులు తగ్గడంతో పాడి రైతులకు లాభాల కంటే నష్టాలే ఎక్కువగా మిగులుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 9.5 లక్షల టన్నుల పశుగ్రాసం అవసరం కాగా, ప్రస్తుతం సుమారు 8 లక్షల టన్నులు మాత్రమే అందుబాటులో ఉంది. ఇంకా 1.5 లక్షల టన్నులు కావాల్సి ఉంది. పశ్చిమ ప్రాంతంలో లక్ష టన్నులకుపైగా గడ్డి అవసరం కాగా, పక్క జిల్లాల నుంచి కొనుగోలు చేసుకుంటున్నారు.
అధిక ధరలు వెచ్చించి...
పశుగ్రాసం కొరతతో మార్కాపురం జిల్లా వాసులు అధికంగా పల్నాడు, నరసరావుపేట, వినుకొండ ప్రాంతాల నుంచి అధిక ధరలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. అక్కడ టన్ను రూ.14 వేల నుంచి రూ.15 వేల చొప్పున కొనుగోలు చేసుకుని ట్రాక్టర్ల ద్వారా ఇక్కడికి తెచ్చుకుంటున్నారు. రవాణా ఖర్చు కూడా అదనపు భారంగా మారుతోంది. సబ్సిడీపై పశుగ్రాసం అందించాలని, పచ్చిమేత సాగును ప్రోత్సహించే కార్యక్రమం చేపట్టాలని రైతులు కోరుతున్నారు. పశుగ్రాస కొరత కొనసాగితే జిల్లాలో పాల ఉత్పత్తి మరింత తగ్గే ప్రమాదం ఉంది.
తగ్గిన పాల ఉత్పత్తి...
రోజుకు 3 గేదెలు ఉంటే 15 కిలోల గడ్డి ఖర్చవుతుంది. ఈ లెక్కన నెలకు 450 కిలోల గడ్డి అవసరం. నాటు గేదె అయితే రోజుకు 3 నుంచి 4 లీటర్లు, ముర్రా జాతి గేదైలెతే రోజుకు 12 నుంచి 13 లీటర్ల పాలు ఇస్తుంది. గతంలో రోజుకు 10 నుంచి 12 లీటర్ల వరకూ పాలిచ్చే గేదెలు ప్రస్తుతం 7 నుంచి 8 లీటర్లు, 4 లీటర్లు ఇచ్చే గేదెలు 2 లీటర్లు మాత్రమే పాలు ఇస్తున్నాయి. గడ్డి ధరలు పెరగడంతో పాటు పశుదాణా, మందులు, ఇతరత్రా ఖర్చులతో పాడి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గడ్డి కోసం వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. పాల ఉత్పత్తి తగ్గడంతో పాడి రైతుల ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. హర్యానా, మధ్యప్రదేశ్, ఢిల్లీ, చైన్నె, తదితర ప్రాంతాల నుంచి రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చుచేసి కొనుగోలు చేసిన మేలు వన్నె జాతి పశువులను సైతం సగం రేటుకే తెగనమ్ముకుంటున్నారు.
పల్నాడు నుంచి టన్ను రూ.4 వేల ప్రకారం గడ్డి కొనుగోలు చేశాను. వర్షాలు లేకపోవడంతో పొలాల్లో పచ్చిగడ్డి దొరకడం లేదు. దీంతో పశువులకు ఎండు గడ్డి పెట్టాల్సి వస్తోంది. టన్ను రూ.4 వేల నుంచి రూ.4,500 వరకూ ఖర్చవుతోంది. పశుపోషణ భారంగా మారుతోంది. ప్రభుత్వం సబ్సిడీపై ఎండుగడ్డి ఇవ్వాలి. గడ్డి డిపోలు ఏర్పాటు చేయాలి.
– చెంచిరెడ్డి, రైతు, మార్కాపురం


