ఎక్స్‌ప్రెస్‌ హైవే పనుల అడ్డగింత | - | Sakshi
Sakshi News home page

ఎక్స్‌ప్రెస్‌ హైవే పనుల అడ్డగింత

Jul 11 2026 7:01 AM | Updated on Jul 11 2026 7:01 AM

ఎక్స్‌ప్రెస్‌ హైవే పనుల అడ్డగింత రిజిస్ట్రేషన్ల విధానాన్ని ప్రైవేటుపరం చేయవద్దు ● జేసీకి డాక్యుమెంట్‌ రైటర్ల వినతి బీపీఎడ్‌, డీపీఎడ్‌ రెండో సెమిస్టర్‌ ఫలితాలు విడుదల డిగ్రీ నాలుగో సెమిస్టర్‌ ఫలితాలు విడుదల

అద్దంకి: మండలంలోని తిమ్మారెడ్డిపాలెంలో తమ పొలాల్లో నుంచి వెళుతున్న రోడ్‌లో పోయిన భూమి తాలూకు నష్టపరిహారం చెల్లంచడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు కార్యాలయాల చుట్టూ తిరగినా ఫలితం లేదని వాపోయారు. దాంతో వారు శుక్రవారం రోడ్డు పనులు జరుగుతున్న ప్రదేశంలో టెంట్‌ వేసి నిరసన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమ నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్‌ చేశారు. ధర్నాలో భూములు కోల్పోయిన రైతులు పాల్గొన్నారు.

మార్కాపురం: రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల విధానాన్ని ప్రైవేటు పరం చేయవద్దని డాక్యుమెంట్‌ రైటర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి సుబ్బారావు, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు సయ్యద్‌ హుస్సేన్‌పీరా, పిన్నిక శివకుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాస్‌కు ఇచ్చిన వినతిపత్రంలో కోరారు. ప్రభుత్వం ఇటీవల జీవో నం 396ను విడుదల చేసిందని, ఈ జీవో ద్వారా రిజిస్టర్‌ ఆఫీసులోని దస్తావేజు లేఖరులు, వారి వద్ద పనిచేసే డీటీపీ ఆపరేటర్లు, సహాయకులు ప్రత్యక్షంగా, పరోక్షంగా రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షలకు పైగా కుటుంబాలు జీవనోపాధి కోల్పోయి రోడ్డునపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ జీవో ప్రకారం నూతన పీపీపీ విధానం ద్వారా టెండర్లలో పాల్గొనే ప్రైవేటు సంస్థల వారికి రిజిస్ట్రేషన్‌ చట్టాలపై అవగాహన లేకపోవడం వలన ప్రజలు ఇబ్బందులు పడతారని, ప్రజలకు వారి ఆస్తి పేపర్లు నేరుగా అందవని, దూర ప్రాంత ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయని వారు తెలిపారు. పీపీపీ విధానం ద్వారా ప్రైవేటు సంస్థల జోక్యం వలన ప్రజల ఆస్తులకు భద్రత కరువవుతుందన్నారు. ఇన్ని నష్టాలు, కష్టాలు కలగజేసే జీవోనెం 396ను తక్షణమే నిలుపుదల చేయాలని కోరారు. డిమాండ్లను ప్రభుత్వానికి తెలపాలన్నారు. అనంతరం స్ధానిక ఎమ్మెల్యే, జనసేన నాయకులకు కూడా వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు స్టార్‌ మస్తాన్‌, కిరణ్‌, కుమార్‌రెడ్డి, రామిరెడ్డి, సీతారెడ్డి, పిన్నిక వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

ఒంగోలు సిటీ: ఆంధ్రకేసరి యూనివర్సిటీ పరిధిలోని బీపీఎడ్‌, డీపీఎడ్‌ కళాశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండో సెమిస్టర్‌ పరీక్షల ఫలితాలను ఏకేయూ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ డీవీఆర్‌.మూర్తి ఆదేశాల మేరకు రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ బి.హరిబాబు శుక్రవారం విడుదల చేశారు. ఈ పరీక్షలకు బీపీఎడ్‌ కోర్సుకు సంబంధించి మొత్తం 963 మంది విద్యార్థులు హాజరు కాగా, వారిలో 93.46 ఉత్తీర్ణత శాతంతో 900 మంది విద్యార్థులు పాసైనట్లు తెలిపారు. డీపీఎడ్‌ కోర్సుకు సంబంధించి మొత్తం 155 మంది విద్యార్థులు హాజరు కాగా, వారిలో 87.10 ఉత్తీర్ణత శాతంతో 135 మంది విద్యార్థులు పాసైనట్లు పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్‌ జి.సోమశేఖర తెలిపారు. ఆయా కళాశాలల స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ బి.హరిబాబు, సీఈ ప్రొఫెసర్‌ జి.సోమశేఖర, ఫైనాన్స్‌ ఆఫీసర్‌ కేవీ.కృష్ణారావు అభినందించారు. కార్యక్రమంలో పీజీ, ప్రొఫెషనల్‌ కోర్సుల కో ఆర్డినేటర్‌ డాక్టర్‌.ఎ.అమృతవల్లి దేవి, బీఎడ్‌ కోర్సుల కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఆర్‌.శ్రీనివాసు, సూడా శివరాం పాల్గొన్నారు.

ఒంగోలు సిటీ: ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయ పరిధిలోని బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ తదితర 7 కోర్సుల ఫలితాలను వైస్‌ చాన్సలర్‌ డీవీఆర్‌ మూర్తి ఆదేశాల మేరకు రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ బి.హరిబాబు శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏసీఈ ప్రొఫెసర్‌ భారతీదేవి మాట్లాడుతూ విశ్వవిద్యాలయ పరిధిలో డిగ్రీలో మొత్తం రెగ్యులర్‌, సప్లమెంటరీ విద్యార్థినీ విద్యార్థులు 7,517 మంది కాగా వారిలో 6,689 మంది హాజరయ్యారు. వారిలో 54.09 శాతం ఉత్తీర్ణులైనట్లు చెప్పారు. విద్యార్థులను విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్‌ డీవీఆర్‌ మూర్తి, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ బి.హరిబాబు, ఏసీఈ ప్రొఫెసర్‌ భారతీదేవి అభినందించారు. కార్యక్రమంలో ఏసీఈ సహాయకులు డాక్టర్‌ సురేష్‌, కార్యాలయ సహాయ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement