మార్కాపురం: జిల్లా స్థాయిలో 2026–27 బిజినెస్ డెవలప్‌మెంట్ ప్లాన్‌పై రెండు రోజుల శిక్షణ కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా పాల్గొన్న మార్కాపురం డీఆర్‌డీఏ పీడీ శివన్నారాయణ మాట్లాడుతూ.. ప్రతి మండల సమాఖ్య ఈసీ సభ్యులకు శిక్షణనిచ్చి, నిర్దేశిత బడ్జెట్ ప్లాన్‌ను ఎన్‌ఆర్‌ఎల్‌ఎం లాగిన్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. ఏపీడీ నీలకంఠారెడ్డి మాట్లాడుతూ.. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, సుస్థిర జీవనోపాధులు వంటి అంశాల్లో విజన్, మిషన్, వ్యూహరచనతో ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. డీపీఎం ఓ.లక్ష్మిరెడ్డి, ఏపీఎంలు పి.రమేష్‌బాబు, యల్సీ ఎం.వెంకిరెడ్డి శిక్షకులుగా వ్యవహరించారు. కార్యక్రమంలో మార్కాపురం ఏపీఎం పిచ్చయ్య, పది మండలాల ఏపీఎంలు, సీసీలు, అకౌంటెంట్లు, ఈసీ సభ్యులు పాల్గొన్నారు.


