పనుల జాడ లేదు.. ప్రచారమే అట్టహాసం! | - | Sakshi
Sakshi News home page

పనుల జాడ లేదు.. ప్రచారమే అట్టహాసం!

Jul 8 2026 2:32 AM | Updated on Jul 8 2026 2:32 AM

క్రెడిట్‌ చోరీపై ప్రజల విస్మయం

క్రెడిట్‌ చోరీపై ప్రజల విస్మయం

సింగరాయకొండ:

వీబీజీ రాంజీ(ఉపాధి హామీ) పథకంపై అవగాహన కల్పించేందుకు సింగరాయకొండ మండలం కనుమళ్ల గ్రామ సచివాలయానికి వచ్చిన కేంద్ర బృందానికి, ఉపాధి కూలీలు తమ కష్టాలను ఏకరువు పెట్టారు. కూలీల సమస్యలు విన్న కేంద్ర బృందం విస్మయానికి గురికాగా.. పక్కనే ఉండి ఈ పరిణామాన్ని గమనిస్తున్న స్థానిక అధికారులు కంగుతిన్నారు. ఈ సందర్భంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌ రాజేశ్వరి మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా చెరువులు, కాలువలు, పశువుల షెడ్ల వంటి పనులతో ఉపాధి మెరుగుపడుతుందని వివరించారు. ఈ పథకంపై మీకు అవగాహన ఉందా అని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌ అడిగిన ప్రశ్నకు స్థానిక కూలీ వెంకటేశ్వర్లు సమాధానమిచ్చారు. క్షేత్రస్థాయిలో పనులు సక్రమంగా జరగడం లేదని కుండబద్ధలు కొట్టారు. చేసిన పనులనే పదే పదే చేస్తూ నిధులు వృథా చేస్తున్నారని ఆరోపించారు. కూలీ డబ్బులు నెలల తరబడి రాక ఉపాధి హామీ కూలీలు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. పశువుల షెడ్ల మంజూరులో జాప్యం చేయడమే కాకుండా, ఉపాధి హామీ జాబ్‌ కార్డులు సైతం ఇవ్వడం లేదని కూలీలు కళ్లగుంట వరలక్ష్మి, ఈదర వెంకటేశ్వర్లు తదితరులు కేంద్ర బృందం ఎదుట వాపోయారు. ఈ సమయంలో ఏపీఓ సుభాషిణి స్పందిస్తూ.. కొన్ని ఫీడర్‌ చానళ్లు ఆక్రమణకు గురయ్యాయని, వాటిని తొలగించాల్సి ఉందని అధికారులకు వివరించే ప్రయత్నం చేశారు.

కేంద్ర బృందం ఎదుట బట్టబయలైన వాస్తవాలు

సింగరాయకొండలో వీబీజీ రాంజీపై కూలీలకు అవగాహన

జాబు కార్డుల మంజూరు, కూలి విడుదలలో జాప్యంపై ప్రజల మొర

గత ప్రభుత్వంలో ఏర్పాటైన బాతుల

యూనిట్‌ను పరిశీలించి ప్రశంస

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement