ఇంటి సర్వే మాకొద్దు... | - | Sakshi
Sakshi News home page

ఇంటి సర్వే మాకొద్దు...

Jun 10 2026 1:37 AM | Updated on Jun 10 2026 1:37 AM

ఇంటి సర్వే మాకొద్దు...

నిలిపేసిన ఇందిరా నగర్‌ గిరిజనులు

ఉలవపాడు:

భూ సేకరణ ప్రక్రియలో భాగంగా కరేడు పంచాయతీ పరిధిలోని ఇందిరానగర్‌ కాలనీ(ధర్మారెడ్డి సంగం)లో ఇంటింటి సర్వేను గిరిజనులు అడ్డుకున్నారు. మంగళవారం ఉదయం కరేడు గ్రామ సచివాలయ సిబ్బంది భూ సేకరణకు సంబంధించి ఇంటింటి సర్వే ప్రారంభించగా గ్రామస్తులందరూ కలసి అడ్డుకున్నారు. ప్రజలకు ముందస్తుగా తెలియచేయకుండా తమ ఇళ్లను సర్వే చేసి ఖాళీ చేయించాలని ప్రయత్నిస్తున్నారని, అందుకే ఈ సర్వే చేయడానికి తాము ఒప్పుకోమని సర్వే సిబ్బందికి తెలియజేశారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గ్రామంలో సమావేశం నిర్వహించకుండా ఎలా సర్వే చేస్తారని ప్రశ్నించారు. భూ సేకరణ, ఇళ్ల తొలగింపు, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ లాంటి సమావేశాలు పెట్టకుండా, సమాచారం ఇవ్వకుండా సర్వే చేయనివ్వమని గిరిజనులు అడ్డుపడడంతో సర్వేను నిలిపేశారు. గిరిజనులు ఈ భూ సేకరణకు సంబంధించి కుల సమావేశం నిర్వహించుకుని తరువాత అధికారులకు, ప్రజాప్రతినిధులకు తెలియచేస్తామని సర్వే సిబ్బందికి తెలియచేశారు. దీంతో వారు వెనుతిరిగారు.

Advertisement
 
Advertisement
Advertisement