న్యూస్‌రీల్
మార్కాపురం జిల్లాలో జోరుగా మద్యం అమ్మకాలు 24 గంటలూ అందుబాటులో మద్యం ఏప్రిల్, మే నెలల్లో రూ.131.43 కోట్ల మద్యం విక్రయం గత ఏడాది ఇదే నెల విక్రయాల కంటే రూ.6 కోట్లు అధికం
పెగ్గు మీద పెగ్గెయ్... అంటూ మందుబాబులు ఫుల్లుగా తాగేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం మద్యం దుకాణాలను బార్లా తెరవడంతో ప్రజలు బానిసలుగా మారుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో భారీగా మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ రెండు నెలల్లో సుమారు రూ.131 కోట్ల మేర విక్రయాలు తాజా పరిస్థితికి అద్దం పడుతున్నాయి. గత ఏడాది ఈ రెండు నెలల్లో వచ్చిన ఆదాయం పోల్చుకుంటే రూ.6 కోట్లు అదనమని అధికార వర్గాలు చెబుతున్నాయి. వేసవిలో తాగునీటి నీరు లభించని ప్రాంతాలు చాలా ఉన్నాయి. కానీ మందు దొరకని గ్రామం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఒంగోలులో మాట్లాడుతున్న బత్తుల బ్రహ్మానందరెడ్డి, పక్కన చుండూరి రవిబాబు, కాకుమాని, కుప్పం ప్రసాద్, కఠారి శంకర్ తదితరులు
సింగరాయకొండలో రౌండ్‌టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్
వైపాలెంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, పాల్గొన్న నాయకులు
కనిగిరిలో ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ వాల్ పోస్టర్‌ను ప్రదర్శిస్తున్న దద్దాల నారాయణ యాదవ్, పార్టీ నేతలు
బాబు రెండేళ్ల పాలనకు నిరసనగా కందుకూరులో నల్ల బెలూన్‌లు ఎగరేస్తున్న బుర్రా మధుసూదన్ యాదవ్, నాయకులు
మద్దిపాడులో మాట్లాడుతున్న మాజీ మంత్రి మేరుగు నాగార్జున
సూపర్ సిక్స్ పేరుతో అలవికాని హామీలిచ్చి గద్దెనెక్కిన
చంద్రబాబు ఏ ఒక్క పథకాన్ని సక్రమంగా అమలు
చేయకుండా ప్రజలను వంచించారు. సంక్షేమ పథకాలకు తూట్లుపొడిచి ప్రజలను మోసం చేశారు. చంద్రబాబు
రెండేళ్ల పాలనా వైఫల్యాలపై ప్రజలతో కలిసి వైఎస్సార్ సీపీ నాయకులు గళమెత్తారు. కూటమి నాయకుల అవినీతిని
ఎండగట్టారు. ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’
నిరసన కార్యక్రమాల్లో భాగంగా వైఎస్సార్ సీపీ
ఆధ్వర్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పలుచోట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలతో సోమవారం రౌండ్‌టేబుల్ సమావేశాలు నిర్వహించారు. కూటమి నేతల వైఫల్యాలపై నినదించారు. ప్రజలకు అండగా ఉంటూ న్యాయం జరిగే వరకు పోరాటాలు చేస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమాల్లో ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు పాల్గొన్నారు.
– సాక్షి నెట్‌వర్క్
● డీఆర్‌డీఏ పీడీ శివన్నారాయణ
మార్కాపురం:
ప్రజల ఆర్ధికాభివృద్ధికి బ్యాంకర్లు సహకరించాలని డీఆర్‌డీఏ పీడీ శివన్నారాయణ కోరారు. స్థానిక వెలుగు కార్యాలయంలో బ్యాంకర్లు, వెలుగు సిబ్బందికి సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి వర్క్‌షాప్‌లో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 6 వేల మైక్రో క్రెడిట్ ప్లాన్స్ (సూక్ష్మ రుణ ప్రణాళికలు) అప్రూవల్ ఇచ్చామని, వాటికి సంబంధించి బ్యాంకు శాంక్షన్, డిస్పాచ్ పెండింగులో ఉందని, బ్యాంకు మేనేజర్లు వీటిని త్వరగా మంజూరు చేయాలని కోరారు. మహిళలు జీవనోపాధులు ఏర్పాటు చేసుకునేందుకు కూడా బ్యాంకర్లు రుణాలు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మహిళలకు పీఎంఈజీపీ, ఉమెన్ లెడ్, పీఎంఎఫ్‌ఎంఈ, పథకాల కింద రుణాలు ఇవ్వాలని కోరారు. పలువురు తీసుకున్న రుణాలను చెల్లించేలా తమకు సహకరించాలని వివిధ బ్యాంకు మేనేజర్లు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో లీడ్‌బ్యాంకు మేనేజరు ఎస్‌కే షాహీద్, యూపీఐ, డీజీఎం రవికుమార్, ఏపీజీబీ ఆర్‌ఎం వెంకటేశ్వర్లు, ఎస్‌బీఐ చీఫ్ మేనేజరు రామకృష్ణ, కెనరా బ్యాంకు చీఫ్ మేనేజరు గౌరీ, వెలుగు ఏపీఎం పిచ్చయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
మార్కాపురం:
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పరిమిత సంఖ్యలో మద్యం షాపులను ఏర్పాటు చేసి ప్రజలకు మద్యాన్ని దూరం చేసింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తాగరా.. తాగి ఊగరా.. అన్న చందంగా ప్రభుత్వం విచ్చలవిడిగా మద్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. వైన్ షాపులతోపాటు బెల్టుషాపుల్లో కూడా 24 గంటలూ మద్యాన్ని అందుబాటులో ఉంచింది. దీంతో మగవాళ్లు తమ సంపాదన మొత్తం తాగుడుకే తగలేస్తున్నారని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో బెల్టుషాపుల ద్వారా డోర్ డెలివరీలు జరుగుతుండగా పట్టణాల్లో సమయ పాలన మరిచి బ్యాక్‌డోర్ బిజినెస్ ఎక్కువగా జరుగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఎకై ్సజ్ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ దాడులు చేయడంలేదన్న విమర్శలు ఉన్నాయి.
మార్కాపురం జిల్లాతోపాటు ప్రకాశం జిల్లాలోని దర్శి నియోజకవర్గంలోని మొత్తం 120 వైన్ షాపుల్లో ఏప్రిల్, మే నెలల్లో ప్రజలు తాగుడుకు రూ.131.43 కోట్లు ఖర్చు చేశారు. గత ఏడాది ఏప్రిల్, మే నెలలతో పోల్చితే ఈ ఏడాది రూ.6 కోట్లు అదనంగా ప్రజలు తాగుడుకు ఖర్చుచేశారంటే మద్యం ఎంత సులభంగా దొరుకుతుందో అర్థం చేసుకోవచ్చు. ఎకై ్సజ్ అధికారులకు టార్గెట్ పెట్టి మరీ వైన్‌షాపుల యజమానులపై ఒత్తిడి పెంచి ప్రభుత్వం మద్యం అమ్మకాలు సాగిస్తోంది. ఏప్రిల్ నెల కంటే మే నెలలో మద్యం అమ్మకాలు ఎక్కువగా సాగాయి. అందులో బీరు అమ్మకాలు అత్యధికంగా ఉన్నాయి. సమయ పాలన పాటించకుండా లిక్కర్ షాపుల్లో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఉదయం పూట 6 గంటల నుంచే బ్యాక్ డోర్ బిజినెస్‌లు బాగా జరుగుతున్నాయి. షాపు ముందుభాగం తాళం వేసి ఉంటుంది. వెనుకవైపు నుంచి మందుబాబులకు లిక్కర్ బాటిళ్లు ఈజీగా దొరుకుతున్నాయి. సంపాదన మొత్తం తాగుడుకే ఖర్చుపెట్టడంతో కుటుంబాలు నాశనం అవుతున్నాయని, అప్పుల పాలవుతున్నామని పలువురు మహిళలు ఆందోళన చెందుతున్నారు.
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో రూ.64.58 కోట్ల లిక్కర్, బీరు అమ్మకాలు జరగగా, మే నెలలో రూ.66.85 కోట్ల అమ్మకాలు జరిగాయి. 2025 ఏప్రిల్‌లో రూ.62.67 కోట్ల లిక్కర్, బీరు అమ్మకాలు జరగగా, గత ఏడాది మే నెలలో లిక్కర్, బీరు కలిపి రూ.61.93 కోట్ల విక్రయాలు జరిగాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది సుమారు రూ.6 కోట్ల ఎక్కువ అమ్మకాలు జరిగినట్టు తెలుస్తోంది.
తాగి..ఊగి..
గత ఏడాది(2025) ఏప్రిల్, మే నెలల్లో అమ్మకాలు
నెల లిక్కర్ బీర్ (కేసుల్లో)
ఏప్రిల్ 77,079 52,142
మే 78,558 44,492
ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో అమ్మకాలు
నెల లిక్కర్ బీర్ (కేసుల్లో)
ఏప్రిల్ 74,661 57,606
మే 73,720 75,576


