ఇంకొల్లు (చినగంజాం): రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా తన జీవితాన్ని కొనసాగించిన ప్రజల మనిషి మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి అని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి కొనియాడారు. ఇంకొల్లు మండలం పావులూరు గ్రామంలోని గాదె స్వగృహంలో సోమవారం నిర్వహించిన గాదె వెంకటరెడ్డి దశదిన కర్మ, సంస్మరణ కార్యక్రమంలో వైవీ పాల్గొని నివాళులర్పించారు. గాదె కుమారుడు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, పర్చూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ గాదె మధుసూదనరెడ్డి, అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ గాదె వెంకటరెడ్డి మృతి రాష్ట్రానికి తీరని లోటని అన్నారు. ఆయన జీవితం.. రాజకీయ ప్రస్థానం అంతా రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా కొనసాగిందన్నారు. వైవీతో పాటు దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాదరెడ్డి, రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి ఆరే శ్యామల, మాజీ మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున, కనుమూరి బాపిరాజు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, రేపల్లె ఇన్‌చార్జ్ పీతా నాగమోహన్, ఎమ్మెల్యే విజయ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య, నాయకులు బసవ పున్నారెడ్డి, కొమ్మూరి కనకారావు, కృష్ణచైతన్య, పులఖండం వెంకారెడ్డి రాష్ట్రంలోని పలువురు సీనియర్ నాయకులు, నియోజకవర్గంలోని ఆరు మండలాల వైఎస్సార్ సీపీ కన్వీనర్లు, నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు పాల్గొని గాదె వెంకటరెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు.
మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి సంస్మరణ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి


