ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలి

Jun 9 2026 9:04 AM | Updated on Jun 9 2026 9:04 AM

యర్రగొండపాలెం: ప్రజల నుంచి సమస్యలపై వచ్చే ప్రతి అర్జీ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి చట్టప్రకారం విచారణ జరిపి త్వరితగతిన న్యాయం చేసే విధంగా ఆయా ప్రాంతాల పోలీస్‌ అధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్పీ హర్షవర్దన్‌రాజు ఆదేశించారు. సోమవారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో నిర్వహించిన మార్కాపురం జిల్లా స్థాయి పోలీస్‌ గ్రీవెన్స్‌లో ఆయన పాల్గొని ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పట్ల నిరంతర పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. ఆ ఫిర్యాదులపై తీసుకున్న చర్యలపై కూడా నివేదిక అందించాలన్నారు. గ్రీవెన్స్‌లో కుటుంబ కలహాలు, భర్త, అత్తారింట వేధింపులు, భూమి, ఆస్తి వివాదాలు, తదితర సమస్యలపై మొత్తం 31 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో మార్కాపురం డీఎస్పీ యు.నాగరాజు, ఎస్బీ సీఐ శ్రీనివాసరావు, డీసీఆర్‌బీ సీఐ దేవప్రభాకర్‌, త్రిపురాంతకం, పొదిలి, మార్కాపురం సీఐలు అస్సన్‌, రాజేష్‌ కుమార్‌, అల్తాఫ్‌ హుసేన్‌, యర్రగొండపాలెం ఎస్సై ఎం.దేవకుమార్‌ పాల్గొన్నారు.

ఎస్పీ హర్షవర్దన్‌రాజు

Advertisement
 
Advertisement
Advertisement