ఒంగోలు సిటీ: పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం సోమవారం ఒంగోలులోని డీఆర్‌ఆర్‌ఎం హైస్కూల్‌లో ప్రారంభమైంది. మూల్యాంకన శిబిరానికి క్యాంప్ ఆఫీసర్‌గా జిల్లా విద్యాశాఖ అధికారి సి.వి.రేణుక వ్యవహరించారు. మూల్యాంకనంలో పాల్గొన్న ఉపాధ్యాయులనుద్దేశించి ఆమె మాట్లాడుతూ జవాబు పత్రాల మూల్యాంకనంలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. విద్యార్థులు రాసిన సమాధానాలకు అనుగుణంగా సరైన మార్కులు కేటాయించాలని తెలిపారు. మార్కుల నమోదుకు సంబంధించి స్పెషల్ అసిస్టెంట్లకు ట్యాబ్‌ల ద్వారా ఎంట్రీ చేసే విధానంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అసిస్టెంట్ కమిషనర్ ఎం.శ్రీనివాసరావు, డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్, ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి టి.కిషోర్‌బాబు, అసిస్టెంట్ క్యాంప్ వాల్యుయేషన్ ఆఫీసర్లు, జరుగుమల్లి మండల విద్యాశాఖ అధికారి బి.నాగేంద్రవదన్, జరుగుమల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి.సుధాకర్ పాల్గొన్నారు.


