18 మంది తహశీల్దార్లు బదిలీ | - | Sakshi
Sakshi News home page

18 మంది తహశీల్దార్లు బదిలీ

Jun 8 2026 9:59 AM | Updated on Jun 8 2026 9:59 AM

18 మంది తహశీల్దార్లు బదిలీ ఏషియన్‌ గేమ్స్‌లో సత్తాచాటిన రాయుడు కరాటేలో రాష్ట్ర స్థాయిలో విద్యార్థి ప్రతిభ

మార్కాపురం: మార్కాపురం జిల్లాలో 18 మంది తహశీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్‌ ఎం.విజయసునీత శనివారం రాత్రి పొద్దుపోయిన తరువాత ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా అవసరాల దృష్ట్యా కొంతమంది తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లను బదిలీ చేసినట్లు తెలిపారు. ఇదే సమయంలో పలువురు తహశీల్దార్లను సెక్షన్‌ సూపరింటెండెంట్‌లుగా నియమించారు. మార్కాపురం తహశీల్దార్‌ చిరంజీవిని పొదిలి తహశీల్దార్‌గా, పెద్దారవీడు తహశీల్దార్‌ శిరీషను తర్లుపాడు తహశీల్దార్‌గా, పొదిలి తహశీల్దార్‌ ఎంవీ కృష్ణారెడ్డిని మార్కాపురం తహశీల్దార్‌గా నియమించారు. కొనకనమిట్ల తహశీల్దార్‌ సురేష్‌ను పెద్దారవీడుకు బదిలీ చేశారు. మార్కాపురం ఆర్డీఓ కార్యాలయంలో కేఆర్‌ఆర్‌సీ తహశీల్దార్‌గా పనిచేస్తున్న వీవీ నాగరాజును కలెక్టరేట్‌ సమన్వయ విభాగం సూపరింటెండెంట్‌గా, యర్రగొండపాలెం తహశీల్దార్‌ మంజునాథరెడ్డిని కలెక్టరేట్‌ ల్యాండ్స్‌–1 విభాగం సూపరింటెండెంట్‌గా, ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌చార్జి కే అర్జున్‌రెడ్డిని కలెక్టరేట్‌ ల్యాండ్స్‌ 2 విభాగం సూపరింటెండెంట్‌గా బదిలీ చేశారు. పామూరు తహశీల్దార్‌ ఏ లక్ష్మీనారాయణను కొనకనమిట్ల తహశీల్దార్‌గా నియమించారు. పామూరు అడహక్‌ తహశీల్దార్‌ ఆర్‌ వాసుదేవరావును పీసీపల్లి రీసర్వే డిప్యూటీ తహశీల్దార్‌గా, తర్లుపాడు అడహక్‌ తహశీల్దార్‌ కే కిశోర్‌కుమార్‌రెడ్డిని తర్లుపాడు డీటీగా, బేస్తవారిపేట తహశీల్దార్‌ ఏ జితేంద్రకుమార్‌ను పెద్దారవీడు రీసర్వే డిప్యూటీ తహశీల్దార్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. రాచర్ల అడహక్‌ తహశీల్దార్‌ ఎస్‌కే రఫీ మార్కాపురం రీసర్వే డిప్యూటీ తహశీల్దార్‌గా, కంభం ఎమ్‌ఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌చార్జి యూ హర్షవర్ధనాచారిని సీఎస్‌పురం డిప్యూటీ తహశీల్దార్‌గా, ఎస్‌ శివరామ ప్రసన్నను పొదిలి నుంచి వైపాలెం రీసర్వే డిప్యూటీ తహశీల్దార్‌గా బదిలీ చేశారు. సీఎస్‌పురం తహశీల్దార్‌ కేవీ ప్రసాద్‌ను కలెక్టరేట్‌లో రిపోర్టు చేయాలని ఆదేశించారు. కనిగిరి తహశీల్దార్‌ ఎన్‌ జయలక్ష్మిని యర్రగొండపాలెం తహశీల్దార్‌గా, డిప్యూటీ తహశీల్దార్‌ డీ పార్వతీబాయిని వెలిగండ్ల డిప్యూటీ తహశీల్దార్‌గా బదిలీ చేస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

బేస్తవారిపేట: మలేషియాలో ఈనెల 2 నుంచి 5వ తేదీ వరకు జరిగిన 2వ ఏషియన్‌ పారా త్రోబాల్‌ చాంపియన్‌షిప్‌–2026 పోటీల్లో బేస్తవారిపేట మండలం ఆర్‌ కొత్తపల్లెకు చెందిన పీ రాయుడు సత్తాచాటాడు. వివిధ రాష్ట్రాలకు చెందిన ఎడుగురు క్రీడాకారుల్లో మన రాష్ట్రం తరఫున పీ రాయుడు పాల్గొన్నారు. ఏషియన్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో ఇండియా టీం కాంస్య పతకం సాధించింది. అంతర్జాతీయ వేదికపై ఇండియా పేరు నిలబెట్టడం ఆనందంగా ఉందని, భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించి భారత త్రివర్ణ పతాకాన్ని మరింత ఎత్తులో ఎగరవేయడానికి నిరంతరం శ్రమిస్తానని రాయుడు తెలిపారు.

మార్కాపురం టౌన్‌: రాష్ట్ర స్థాయిలో జరిగిన కరాటే పోటీల్లో మార్కాపురం విద్యార్థి ఎం.జోషితారెడ్డి 3వ స్థానం సాధించినట్లు శిక్షణ ఇచ్చిన కరాటే నిర్వాహకులు మారంరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. జూన్‌ 4 నుంచి 7 వరకూ ఉత్తరాఖండ్‌లోని డెహరాడూన్‌లో కరాటే ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహించిన కియో సబ్‌ జూనియర్‌ కాడెట్‌–జూనియర్‌ కరాటే ఛాంపియన్‌ షిప్‌–2026 పోటీల్లో 12 సంవత్సరాల బాలికల విభాగంలోని కటా చాంపియన్‌షిప్‌లో జోషిత రెడ్డి ఏపీ తరఫున పతకం సాధించినందుకు అభినందనలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement