జనసేన నుంచి వైఎస్సార్‌ సీపీలోకి | - | Sakshi
Sakshi News home page

జనసేన నుంచి వైఎస్సార్‌ సీపీలోకి

Jun 8 2026 9:59 AM | Updated on Jun 8 2026 9:59 AM

టంగుటూరు: మండలంలోని జమ్ములపాలెం అంబేడ్కర్‌నగర్‌కు చెందిన 10 కుటుంబాలు జనసేన పార్టీని వీడి ఆదివారం వైఎస్సార్‌ సీపీ చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ పీఏసీ సభ్యుడు, నియోజకవర్గ ఇన్‌చార్జి ఆదిమూలపు సురేష్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మండల ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు శాన్‌కోటి, టంగుటూరు పట్టణ అధ్యక్షుడు కొమ్ము సురేంద్ర, టంగుటూరు అరుంధతి నాయకులు రోషన్‌ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ పేదల పార్టీ అన్నారు. ఏ కష్టం వచ్చినా తాను అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. పార్టీలో చేరిన వారిలో నెరుసుల గౌతమ్‌, స్టీఫెన్‌, కసుకుర్తి ఏప్రాయం, ఇడిగాటి వంశీ, ఇడిగాటి సాత్విక్‌, మెడబలిమి అనిల్‌, తిప్పగుడిసె మహేష్‌, సలగల మోజెస్‌, సలగల బ్రేనాట్‌, పులగర క్రాంతి తదితరులు వైఎస్సార్‌ సీపీలో చేరారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు చింతపల్లి హరిబాబు, కట్టా బాబురావు, పందిటి అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement