తూములు రిపేరు చేయాలి | - | Sakshi
Sakshi News home page

తూములు రిపేరు చేయాలి

Jun 8 2026 9:59 AM | Updated on Jun 8 2026 9:59 AM

మార్కాపురం నియోజకవర్గ వ్యాప్తంగా ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం లోపే చెరువలకు మరమ్మతులు చేపట్టాలి. బలహీనంగా ఉన్న చెరువు కట్టలను రిపేర్లు చేయాలి. ముఖ్యంగా మార్కాపురం చెరువు కాలువలు చిల్లచెట్లతో మూసుకుపోయాయి. కాలువలు బాగుచేయడంతోపాటు తూములు కూడా రిపేరు చేయాలి. అప్పుడే చెరువుకు నీళ్లొస్తే ఉపయోగం ఉంటుంది. రైతులు పొలాలు సాగుచేసుకుంటారు.

– జి శ్రీనివాసరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్‌, మార్కాపురం

చెరువులకు మరమ్మతులు ఎప్పుడు?

శతాబ్ధాల చరిత్ర కలిగిన మార్కాపురం చెరువుకు మరమ్మతులు ఎప్పుడు చేస్తారో అర్థం కావడం లేదు. చెరువులో పూడిక పేరుకుపోయింది. చెరువు కాలువలు, తూములు, పంట కాలువలకు మరమ్మతులు చేస్తే ఉపయోగంగా ఉంటుంది. జల వనరుల శాఖ అధికారులు త్వరగా పనులు ప్రారంభించాలి.

– జి సత్యనారాయణరెడ్డి, వైఎస్సార్‌ సీపీ పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి

టెండర్లు పూర్తయ్యాయి

ఈ ఏడాది మార్కాపురం నీటి పారుదలశాఖ పరిధిలో ఆర్‌ఆర్‌ఆర్‌ పథకం కింద 22 వర్కులకు రూ.13.47 కోట్లు, ఓఅండ్‌ఎమ్‌ కింద 42 వర్కులకు 3.35 కోట్లు మంజూరయ్యాయి. చాలా వరకూ టెండర్లు ఫైనల్‌ అయ్యాయి. అగ్రిమెంట్లు కూడా చాలావరకు అయ్యాయి. పనులు త్వరలోనే ప్రారంభమవుతాయి.

– హర్షింగ్‌ నాయక్‌, ఇరిగేషన్‌ ఈఈ, మార్కాపురం

Advertisement
 
Advertisement
Advertisement