న్యూస్‌రీల్
వెలుగొండకు అత్తెసర నిధులు ముందుకు సాగని ప్రాజెక్టు పనులు ఇప్పట్లో నీళ్లు పారేది అనుమానమే ఎనిమిది నెలల్లో 8 సార్లు మంత్రి రామానాయుడు పర్యటన సమీక్షలతో హడావుడి తప్ప ఒనగూడిందేమీలేదన్న విమర్శలు మందకొడిగా టీబీఎం మిషన్ తొలగింపు పనులు మొక్కుబడిగా పరిహారం చెల్లింపు
ఆగడాలు ఆగేనా..
ముండ్లమూరు ఎస్సై రెండు నెలలుగా లేరు. దీంతో అక్కడున్న ఏఎస్సై ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. స్టేషన్‌లో ప్రైవేటు పంచాయితీలు, దందాలు చేస్తున్నారు.
రెండో టన్నెల్లో టీబీఎం మిషన్ తొలగింపు పనులు మందకొడిగా సాగుతున్నాయి. ఈ ప్రక్రియను వెలుగొండ ప్రాజెక్టు ఇంజినీరింగ్ అధికారులు 7 గ్యాండ్రిల్‌గా విభజించారు. ఒక గ్యాండ్రిల్ మాత్రమే ఇప్పటి వరకూ తొలగించగలిగారు. ఈ ప్రక్రియ పూర్తికావాలంటే రెండు, మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. టీబీఎం 9.8 మీటర్ల వ్యాసార్థంతో 176 మీటర్ల పొడవు ఉంది. ఇది టన్నెల్ లోపల 11.85 కిలోమీటర్ల వద్ద ఉంది. ముక్కలు ముక్కలుగా చేసి బయటకు తీసుకుని రావాల్సి ఉంటుంది. ఇందుకోసం పెద్దఎత్తున టన్నెల్ లోపలికి టిప్పర్లను పంపి దోర్నాల మండలం కొత్తూరు వైపు నుంచి బయటకు తెస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితేనే రెండో టన్నెల్ ద్వారా నీళ్లు బయటకు వస్తాయి. ఇటు టీబీఎం పనులు పూర్తికాక.. అటు పరిహారానికి నిధులు ఇవ్వకుండా వెలుగొండకు నీళ్లు ఎలా ఇస్తారో.. కూటమి పెద్దలకే తెలియాలని పశ్చిమ ప్రకాశం ప్రజలు నిట్టూరుస్తున్నారు.
మూడు జిల్లాల ప్రజల కలల ప్రాజెక్టు పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టుకు ఇప్పట్లో మోక్షం లభించేలా కనిపించడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం విదులుస్తున్న అత్తెసరు నిధులతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. నీళ్లు ఇచ్చే తేదీలు మారుతున్నాయి కానీ ఇప్పట్లో కరువు నేలపై కృష్ణమ్మ పరుగులు లేనట్టేనని నిట్టూర్పులు సర్వత్రా వినిపిస్తున్నాయి. మంత్రి రామానాయుడు హడావుడి పర్యటనలతో ఓనగూడింది ఏమీలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. టీబీఎం మిషన్ తొలగింపు పనులు మందకొడిగా సాగుతున్నాయి. ఇంత వరకూ నిర్వాసితులకు పరిహారం ఊసేలేదు. ఇవన్నీ చూస్తుంటే పాలకులు ప్రకటిస్తున్న సమయానికి వెలుగొండ నీరు పారేది ప్రశ్నార్థకంగా మారింది.
నిధులు పారక..
వెలుగొండ సాగక..!


