రాచర్ల: మండలంలోని జేపీ చెరువు గ్రామ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన నెమలిగుండ్ల రంగనాయకస్వామి ఆలయానికి శనివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజలు చేశారు. ఉదయం 10 గంటలకు స్వామి వారికి ఆలయ అర్చకులు అన్నవరం సత్యనారాయణచార్యులు, అన్నవరం వెంకటరంగచార్యులు ఆధ్వర్యంలో పట్టువస్త్రాలను ప్రత్యేక పూలతో అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. స్వామి వారి దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూలో నిల్చొని దర్శనం చేసుకున్నారు. అనంతరం భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఈవో మల్లవరపు నాగయ్య, చైర్మన్ సిద్ధం నరసింహులు, సిబ్బంది పాల్గొన్నారు. భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు.


