కొండపి:
స్థానిక పొగాకు వేలం కేంద్రంలో శనివారం నిర్వహించిన వేలంలో 73 బేళ్లు తిరస్కరణకు గురైనట్లు వేలం కేంద్ర నిర్వహణాధికారి ఎం.శంకర్ రావు తెలిపారు. క్లస్టర్ పరిధిలోని పచ్చవ గ్రామానికి చెందిన రైతులు 293 బేళ్లను వేలానికి తీసుకురాగా 220 బేళ్లను కొనుగోలు చేసి 173 బేళ్లను తిరస్కరించారు. గరిష్ట ధర రూ.250, కనిష్ట ధర రూ.180, సరాసరి ధర రూ.223.31గా నమోదైంది. వేలంలో 10 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. వ్యాపారులు సిండికేట్‌గా మారి కొనుగోలు చేస్తున్నారని, దీంతో రైతులు తీవ్ర నష్టాల్లోకి పోతున్నామని వాపోతున్నారు. వేలానికి తీసుకువచ్చే బేళ్లను సగటు ధరకు కొనుగోలు చేయాలని కోరుతున్నారు. గరిష్ట ధర రూ.300 తగ్గకుండా కొనుగోలు చేస్తేనే నష్టాలు కొంత మేర తగ్గించుకొని అప్పులు లేకుంటా ఉంటామని రైతులు పేర్కొంటున్నారు.
టంగుటూరు: స్థానిక పొగాకు వేలం కేంద్రం పరిధిలో శనివారం జరిగిన వేలంలో 525 పొగాకు బేళ్లు కొనుగోలు చేశారు. టంగుటూరు, చిర్రికూరపాడు, పంగులూరివారిపాలెం గ్రామాల రైతులు 698 బేళ్లను వేలానికి తీసుకురాగా 525 బేళ్లను కొనుగోలు చేసి 173 బేళ్లను తిరస్కరించారు. గరిష్ట ధర రూ.250, కనిష్ట ధర రూ.180, సరాసరి ధర రూ.223.16గా నమోదైంది. వేలంలో 9 మంది వ్యాపారులు పాల్గొన్నారు.


