జూన్‌ 8న సీనియర్‌ పురుషుల హాకీ జట్టు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జూన్‌ 8న సీనియర్‌ పురుషుల హాకీ జట్టు ఎంపిక

Jun 6 2026 1:53 AM | Updated on Jun 6 2026 1:53 AM

జూన్‌ 8న సీనియర్‌ పురుషుల హాకీ జట్టు ఎంపిక పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత ● ఒకటో అదనపు జిల్లా న్యాయమూర్తి టి.రాజ్యలక్ష్మి బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి ● సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్‌కే మాబు ● కుటుంబాలను పరామర్శించిన సీపీఎం నేతలు

సంతనూతలపాడు(చీమకుర్తి రూరల్‌): ప్రకాశం జిల్లా హాకీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీన సంతనూతలపాడు మండలం మైనంపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సీనియర్‌ పురుషుల హాకీ జట్టు ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా హాకీ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు రమణారెడ్డి, సుందర రామిరెడ్డి ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు తమ పదో తరగతి మార్కుల జాబితా, ఆధార్‌ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం (బర్త్‌ సర్టిఫికెట్‌)తో అదే రోజు ఉదయం 9 గంటలకు హాజరు కావాలని కోరారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు 01011992 తర్వాత జన్మించి ఉండాలని తెలిపారు. మరిన్ని వివరాలకు తిరుమలశెట్టి రవికుమార్‌, పీఈటీ మైనంపాడు మొబైల్‌ నంబర్‌ 9951578357 ను సంప్రదించాలని కోరారు.

ఒంగోలు: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఒకటో అదనపు జిల్లా న్యాయయూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ తాత్కాలిక చైర్‌పర్సన్‌ టి.రాజ్యలక్ష్మి అన్నారు. స్థానిక జిల్లా న్యాయస్థానాల సముదాయం ఆవరణలో శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మొక్కలు నాటే కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రకృతిపరమైన అనేక అనర్థాలకు పర్యావరణంలో సమతుల్యత దెబ్బతినడమే కారణమన్నారు. ఈ ఏడాది వేసవికాలం ప్రత్యక్షంగా ప్రజలు అనుభవిస్తున్న అధిక ఎండలు కూడా పర్యావరణం మీద మనం చూపించే నిర్లక్ష్యమే కారణమన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని నిరంతరం పర్యవేక్షించి చెట్లుగా పెరిగేలా పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ తాత్కాలిక కార్యదర్శి, ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి వి.పల్లవి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

ఒంగోలు సిటీ: ఒంగోలు మండలం చెరువుకొమ్ముపాలెంలో నీటి కుంటలో మునిగి చనిపోయిన నలుగురు చిన్నారుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్‌కే మాబు డిమాండ్‌ చేశారు. ఒంగోలు రిమ్స్‌ మార్చురీ వద్ద బాధిత కుటుంబాల సభ్యులను సీపీఎం జిల్లా కమిటీ నేతలు పరామర్శించారు. ఇద్దరు కుమారులను కోల్పోయిన తండ్రి కరేటి కళ్యాణ్‌ చక్రవర్తి, మృతి చెందిన ఇల్లా దినేష్‌ తల్లి లక్ష్మిని ఓదార్చి మనోధైర్యంతో ఉండాలని కోరారు. చిన్నారుల మృతి పట్ల సంతాపం ప్రకటించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్‌కే మాబు మాట్లాడుతూ నీటి కుంటలో పడి నలుగురు చిన్నారులు మృతి చెందడం బాధాకర విషయమన్నారు. చెరువుకొమ్ముపాలెంలో మట్టి అక్రమ తవ్వకాలు జరిగి కుంటలోకి నీరు చేరిందని, లోతు తెలియని చిన్నారులు అందులోకి దిగి మరణించారన్నారు. గనులు, భూగర్భ జల శాఖ అక్రమ తవ్వకాలను నివారించుంటే ఇటువంటి ప్రమాదం జరిగి ఉండేది కాదన్నారు. చెరువుకొమ్ముపాలెంలో అక్రమ మట్టి తవ్వకాలు అరికట్టేందుకు గనుల శాఖ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి మరణించిన నలుగురు చిన్నారుల కుటుంబాలను ఆదుకోవాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో సీపీఎం ఒంగోలు నగర కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు, జిల్లా నాయకులు బీ రఘురాం పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement