విద్యుత్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యం

Jun 6 2026 1:53 AM | Updated on Jun 6 2026 1:53 AM

డిస్కం జనరల్‌ కౌన్సిల్‌ సమావేశంలో వీఎస్‌ఆర్‌కే గణపతి డిస్కం అధ్యక్షుడిగా రాచగర్ల సంజీవరావు ఏకగ్రీవం

ఒంగోలు సబర్బన్‌: విద్యుత్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు పోతున్నామని ఆంధ్రప్రదేశ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌–1104 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్‌ఆర్‌కే గణపతి అన్నారు. విద్యుత్‌ ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం పోరాటానికై నా వెనకాడేది లేదన్నారు. మూడో ఏపీ సీపీడీసీఎల్‌ డిస్కం జనరల్‌ కౌన్సిల్‌ సమావేశం శుక్రవారం ఒంగోలులో నిర్వహించారు. ఈ సందర్భంగా డిస్కం నూతన కమిటీని ఎన్నుకున్నారు. డిస్కం అధ్యక్షుడుగా రాచగర్ల సంజీవరావు, డిస్కం కార్యదర్శిగా నందిగామ శర్మ, డిస్కం కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బొర్రా శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గణపతి మాట్లాడుతూ యూనియన్‌ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. నూతనంగా ఎన్నికై న డిస్కం అధ్యక్షుడు రాచగర్ల సంజీవరావు మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి డిస్కం అధ్యక్షుడుగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. యూనియన్‌ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు. ఉద్యోగుల సమస్యలపట్ల అనునిత్యం యాజమాన్యంతో పోరాడదామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా యూనియన్‌ను మరింత బలోపేతం చేసేందుకు నూతన కమిటీ సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గణపతి వీఎస్‌ఆర్‌కే ఎన్నికల అధికారిగా నిర్వహించగా, రాష్ట్ర అధ్యక్షుడు వి.దేవేందర్‌ రెడ్డి సమావేశానికి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఆర్‌.సంజీవరావు, అదనపు ప్రధాన కార్యదర్శులు ఎన్‌.శ్రీనివాసరావు, మల్లేశ్వర రెడ్డి తదితర రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement