ఏర్పాట్లు సిద్ధం ‘సర్‌’! | - | Sakshi
Sakshi News home page

ఏర్పాట్లు సిద్ధం ‘సర్‌’!

Jun 5 2026 4:47 AM | Updated on Jun 5 2026 4:47 AM

కాన్వెక్స్‌ మిర్రర్‌లు మాయం

మార్కాపురం: జిల్లా వ్యాప్తంగా ఈనెల 5 నుంచి ‘సర్‌’ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) కార్యక్రమం ప్రారంభమవుతోంది. మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, నియోజకవర్గాల పరిధిలోని 21 మండలాల్లో మొత్తం 9,08,626 మంది ఓటర్లు ఉన్నారు. ఆయా నియోజకవర్గాల్లోని 1103 మంది బీఎల్‌ఓలు తమ పరిధిలోని గృహలకు వెళ్లి ఓటర్ల వివరాలను తనిఖీ చేయనున్నారు. నిబంధనల ప్రకారం ఓటర్లు ఉన్నారా.. లేదా.., మృతులు, అనర్హుల ఓట్ల వివరాలను సేకరించి తొలగించడంతో పాటు 18 ఏళ్లు నిండిన వారికి ఓటుహక్కు కల్పించనున్నారు. శ్రీసర్‌శ్రీ ప్రక్రియలో భాగంగా బీఎల్‌ఓలకు శుక్రవారం నుంచి 14వ తేదీ వరకు శిక్షణ ఇస్తున్నారు. ఈ నెల 15 నుంచి జూలై 14వ తేదీ వరకు బూత్‌ లెవెల్‌ ఆఫీసర్లు ప్రతి ఇంటికీ వెళ్లి వివరాలు సేకరించి మ్యాపింగ్‌ చేస్తారు. జూలై 21న ముసాయిదా జాబితా విడుదల చేసి, ఆగస్టు 20వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. అనంతరం వాటిని పరిష్కరించి సెప్టెంబర్‌ 22న తుది జాబితాలు విడుదల చేస్తారు.

ఇప్పటికే వివిధ పార్టీల నాయకులతో రెవెన్యూ అధికారులు సమావేశాలు ఏర్పాటు చేశారు. మార్కాపురం జిల్లాలో వైపాలెం మినహా మిగిలిన 3 నియోజకవర్గాల్లో కొత్తగా 42 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కాగా ఇంటింటి సర్వేకు వచ్చే ఎన్నికల సిబ్బందికి ప్రజలు సహకరించాలని, 18 ఏళ్లు నిండిన వారు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని డీఆర్‌ఓ శివరామిరెడ్డి సూచించారు.

పెద్దదోర్నాల: యాత్రికుల రక్షణ కోసం ఘాట్‌ రోడ్లలో ఏర్పాటు చేసిన కాన్వెక్స్‌ మిర్రర్‌లు ఒక్కొక్కటిగా మాయమవుతున్నాయి. ఇటీవల ఎస్పీ హర్షవర్థన్‌రాజు ఆదేశాల మేరకు మండల పరిధిలోని శ్రీశైలం ఘాట్‌ రోడ్డులో కొన్ని ప్రమాదకర మలుపుల వద్ద పోలీసులు కాన్వెక్స్‌ మిర్రర్‌లు ఏర్పాటు చేశారు. మండల కేంద్రంలోని పెద్ద మూల టర్నింగ్‌తో పాటు తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కొన్ని మిర్రర్‌లను వాటి ప్రాధాన్యం తెలియని కొందరు ఆకతాయిలు మాయం చేశారు. ఐరన్‌ పోల్స్‌ మాత్రమే ఘాట్‌రోడ్‌లో దర్శనమిస్తున్నాయి. ఎదురుగా వస్తున్న వాహనాలను గుర్తించే అద్దాలు ఇలా మాయం కావడంపై వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నేటి నుంచి ఎలక్షన్‌ సెల్‌ సిబ్బందికి శిక్షణ

ఈ నెల 15 నుంచి ఇంటింటి సర్వే

నియోజకవర్గం ఓటర్లు బీఎల్‌ఓలు

మార్కాపురం 2,15,515 257

గిద్దలూరు 2,42,143 284

కనిగిరి 2,42,680 297

యర్రగొండపాలెం 2,08,288 265

Advertisement
 
Advertisement
Advertisement