శింగరకొండలో వైవీ దంపతుల
అద్దంకి: మండలంలోని శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో ఆదివారం మాజీ టీటీడీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన పేరిట 40 రోజులు మన్యుసూక్తపారాయణ, మన్యుసూక్త హోమం అర్చకులు నిర్వహించారు. 41వ రోజైన ఆదివారం మండపారాధన తోపాటు ప్రత్యేక పూజలతో పూర్ణాహుతి నిర్వహించారు. హోమం పూర్తయిన తరువాత సుబ్బారెడ్డి దంపతులు లక్ష తమలపాకుల అర్చనలో పాల్గొన్నారు. వైవీ దంపతులను అర్చకులు స్వామి వారి శేష వస్త్రంతో సత్కరించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆశీర్వచనం ఇచ్చారు. తదుపరి తీర్థప్రసాదాలు, అన్నప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. ఈ పూజా కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ చింతలపూడి అశోక్‌కుమార్, బాపట్ల జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు ఈదా శ్రీనివాసరెడ్డి, కొండపి మాజీ ఇన్‌చార్జి వెంకయ్య, రాష్ట్ర ప్రచార కమిటీ జాయింట్ సెక్రటరీ కోయి అంకారావు, నాయకుడు జజ్జర ఆనందరావు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు పాల్గొన్నారు.


