అరుదైన నక్షత్ర తాబేలు లభ్యం | - | Sakshi
Sakshi News home page

అరుదైన నక్షత్ర తాబేలు లభ్యం

Jun 1 2026 7:17 AM | Updated on Jun 1 2026 7:17 AM

అరుదైన నక్షత్ర తాబేలు లభ్యం

అటవీ శాఖ అధికారులకు అప్పగించిన యువకులు

పొన్నలూరు: మండలంలోని పరుచూరివారిపాలెం సమీపంలో పాలేరు వద్ద అరుదైన నక్షత్ర తాబేలు దర్శ నమిచ్చింది. గ్రామానికి చెందిన యువకులు మన్మధ, శేఖర్‌ ఆదివారం గ్రామానికి సమీపంలోని పాలేరు వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో అరుదైన నక్షత్ర తాబేలు వారి కంటపడింది. తాబేలును పట్టుకుని గ్రామానికి చేరుకోగా పెద్దల సూచన మేరకు అటవీశాఖ అధికారులకు అప్పగించారు. అంతరించిపోతున్న జాబితాలో ఉన్న అరుదైన నక్షత్ర తాబేలును యువకులు సంరక్షించి తీసుకురావడం అభినందనీయమని అటవీశాఖ అధికారి పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement