సింగరాయకొండ: స్థానిక రైల్వేస్టేషన్‌లో శనివారం ఉదయం చైన్నె వెళ్లే పినాకిని ఎక్స్‌ప్రెస్ రైలును 2,3 ప్లాట్‌ఫాం లైనులో కాకుండా మధ్య లైనులో ఆపడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. ప్రయాణికుల ఇబ్బందులపై సాక్షిలో ‘ఇంత నిర్లక్ష్యమేల..రైలెక్కదెలా.?’ అన్న శీర్షికన కథనం రావడంతో రైల్వే అధికారులు స్పందించారు. ఈ ఘటనపై ఆదివారం విచారణ చేపట్టారు. రికార్డులను పరిశీలించి కంట్రోలర్ బాధ్యుడిగా గుర్తించి అతనికి హెచ్చరికలు జారీచేశారు. భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు పునరావృత్తం కాకుండా తగిన జాగ్రత్తలు పాటించనున్నట్లు రైల్వేశాఖ ఒక ప్రటకనలో స్పష్టం చేసింది.


