విద్యుదాఘాతానికి వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతానికి వ్యక్తి మృతి

Jun 1 2026 7:17 AM | Updated on Jun 1 2026 7:17 AM

విద్యుదాఘాతానికి వ్యక్తి మృతి

సంతమాగులూరు (అద్దంకి): విద్యుదాఘాతానికి వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని కామేపల్లిలో శనివారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కామేపల్లి గ్రామానికి చెందిన దుద్దుకూరి రామాంజి(30) చిలకలూరిపేటకు చెందిన లక్ష్మితో వివాహమైంది. అయితే మనస్ఫర్థలతో మూడేళ్ల క్రితం విడాకులు తీసుకున్నాడు. ఈ క్రమంలో కామేపల్లి ఎస్సీ కాలనీలో సుజాత అనే మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో గత నెల 30వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో బయటకు వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అయితే ఎంతసేపటికి రాకపోవడంతో సుజాత బయటకు వచ్చి చూడగా..పక్కనే ఉన్న విద్యుత్‌ వైరు తగిలి విద్యుదాఘాతానికి గురైనట్లు గుర్తించింది. వెంటనే స్థానిక ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లింది. విషయం తెలుసుకున్న రామాంజీ తల్లి చాయమ్మ, బంధువులు ఆటోలో నరసరావుపేటలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు ధృవీకరించారు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పట్టాభి రామయ్య తెలిపారు.

రాగి వైరు మళ్లీ చోరీ

మరమ్మతులు చేసిన 24 గంటల్లోనే మళ్లీ అపహరించిన దుండగులు

గ్రామానికి నిలిచిన తాగునీటి సరఫరా

టంగుటూరు:

మండలంలోని మర్లపాడులో మంచినీటిని సరఫరా చేసే మోటార్‌ రాగి వైర్లు వరుసగా చోరీకి గురవుతుండటంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళితే..గ్రామంలో రెండు రోజులక్రితం పైలెట్‌ ప్రాజెక్టు పథకం కింద పంపు హౌస్‌లో మోటార్‌ నుంచి వచ్చే రాగి వైర్‌ చోరీకి గురైంది. దీంతో గ్రామస్తులు, నాయకులు పోలీసులు సమాచారం ఇచ్చారు. అనంతరం శనివారం రాత్రి పది గంటలకు పంపు హౌస్‌లో వైర్లు మరమ్మత్తులు చేశారు. అయితే ఆదివారం మధ్యాహ్నం సమయంలో మళ్లీ పంపు హౌస్లో మరొకసారి కాపర్‌ వైర్లు దుండగులు అపహరించారు. దీంతో గ్రామస్తులు తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాజెక్టు గ్రామానికి దూరంగా ఉండటంతో దుండగులు వైర్లు చోరీకి చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement