సింగరాయకొండలో కూలిన భారీ వృక్షం... | - | Sakshi
Sakshi News home page

సింగరాయకొండలో కూలిన భారీ వృక్షం...

May 31 2026 1:36 AM | Updated on May 31 2026 1:36 AM

సింగరాయకొండలో కూలిన భారీ వృక్షం...

సింగరాయకొండ:

స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ వెనుకవైపు రోడ్డులో శనివారం భారీ చెట్టు కూలిపడింది. శుక్రవారం రాత్రి ఈదురుగాలులు వీచడంతో ఆ ప్రాంతంలో విద్యుత్‌ కండక్టర్‌ తెగింది. దీంతో విద్యుత్‌శాఖ అధికారులు ఆ చెట్టుకు విద్యుత్‌ పరికరాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా విద్యుత్‌ కండక్టర్‌ ఏర్పాటు చేసి తాత్కాలికంగా విద్యుత్‌ను పునరుద్ధరించారు. అయితే, శనివారం మధ్యాహ్నం 11 గంటల సమయంలో హఠాత్తుగా ఆ చెట్టుకు విద్యుత్‌ పరికరం ఏర్పాటు చేసిన ప్రాంతంలో మంటలు చెలరేగాయి. స్థానికులు దూరంగా పరిగెత్తుతుండగానే.. ఒక్కసారిగా భారీ వృక్షం కూలి రోడ్డుపై అడ్డంగా పడింది. ముందుగా మంటలు రావడంతో అక్కడున్నవారు అప్రమత్తమవడంతో ప్రాణ నష్టం తప్పిందని స్థానికులు తెలిపారు. విద్యుత్‌ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు తాత్కాలికంగా విద్యుత్‌ సరఫరా నిలిపివేసి చెట్టును తొలగించిన అనంతరం విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు.

Advertisement
 
Advertisement
Advertisement