న్యూస్‌రీల్
మందగించిన ఎగుమతులు భారీగా పెరిగిన రాయల్టీతో ఆర్థిక కష్టాలు అమ్మకానికి సిద్ధంగా గ్రానైట్ క్వారీలు సబ్ లీజులతో నెట్టుకొస్తున్న కొందరు యజమానులు గుదిబండలా తగులుకున్న ఏఎంఆర్ వసూళ్లు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన గ్రానైట్ పరిశ్రమ
జిల్లాలో గ్రానైట్ పరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ఎగుమతులు మందగించాయి. ఆదాయం బాగా పడిపోతుండడంతోఈ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. దీనికి తోడు రాయల్టీ వసూలు కోసం ప్రభుత్వం నియమించిన ఏఎంఆర్ సంస్థ గ్రానైట్ పరిశ్రమకు గుదిబండలా తగులుకుంది. ఫలితంగా క్వారీలు నిర్వహించలేక చాలా మంది యజమానులు చేతులెత్తేస్తున్నారు. ప్రొడక్షన్‌కు, వస్తున్న రాబడికి పొంతన లేక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఇప్పటికే కొన్ని క్వారీలు మూతపడగా, మరికొన్ని అదేబాట పడుతున్నట్టు తెలుస్తోంది.


