గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులో రేమా ఫీబే, రూబీ సూసన్నకు చోటు | - | Sakshi
Sakshi News home page

గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులో రేమా ఫీబే, రూబీ సూసన్నకు చోటు

May 31 2026 1:18 AM | Updated on May 31 2026 1:18 AM

ఒంగోలు సిటీ: ఒంగోలు పట్టణానికి చెందిన చదలవాడ రాజేష్‌ బాబు, మేరీ జోష్ణల కుమార్తెలు రేమా ఫీబే, రూబీ సూసన్నలు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులో చోటు సంపాదించారు. వీరు ఒంగోలు పట్టణానికి చెందిన డినోమినేషన్‌ చర్చెస్‌ యూనియన్‌ అధ్యక్షుడు శిఖా ఐజక్‌బాబు మనవరాళ్లు. హైదరాబాద్‌లో ఫిబ్రవరి 2వ తేదీన 22 దేశాల నుంచి 2 వేల మంది కీబోర్డు వాయిద్యకారులు గంటపాటు కీబోర్డు ఆగకుండా వాయించి రికార్డు సృష్టించారు. అందులో కీబోర్డు వాయించడంలో ప్రతిభ చూపిన 777 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వారిలో రేమా ఫీబే, రూబీ సూసన్న ఉన్నారు. వారికి ఈనెల 29వ తేదీన హైదరాబాద్‌ గచ్చిబౌలి విక్టరీ ఆడిటోరియంలో హల్లెల్‌ మ్యూజిక్‌ స్కూల్‌ వ్యవస్థాపకుడు అగస్టిన్‌ దండింగి గిన్నిస్‌ రికార్డు సర్టిఫికెట్లు, మెడల్‌ అందజేసి అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement