పొదిలి రూరల్: ఓ డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ఏ మాత్రం అదుపు తప్పినా ప్రయాణికులకు పెను ప్రమాదం జరిగేది. అద్దంకి బస్సు డ్రైవర్ సెల్‌ఫోన్ చూస్తూ బస్సును డ్రైవింగ్ చేస్తున్నాడు. అర్జంట్ ఫోన్ అయితే సాధారణంగా డ్రైవర్లు మాట్లాడుతుంటారు. పొదిలి నుంచి అద్దంకి వైపు బస్సు డ్రైవ్ చేశాడు. సెల్ ఫోన్‌లో గేమ్‌నో, లేకుంటే ఇతర రీల్స్ చూస్తూ బస్సు నడుపుతుండటంపై ప్రయాణికులు హడలిపోయారు. రెండు చేతులతో సెల్‌ఫోన్ పట్టుకుని, ఆ చేతులను స్టీరింగ్‌పై ఉంచి ఫోన్ చూస్తున్నాడు. ప్రయాణికులు ఎవరో వీడియో తీసి పెట్టడంతో ఆ వీడియో వైరల్ అయింది. డ్రైవర్ నిర్లక్ష్యం పట్ల ప్రయాణికులతో పాటు, ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు.


