అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్‌కు మధుబాబు
అద్దంకి: మండలంలోని తిమ్మాయపాలెం గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పీడీగా పనిచేస్తున్న ఉప్పాల మధుబాబు అంతర్జాతీయ స్థాయి మస్టర్ అథ్లెటిక్ పోటీలకు ఎంపికయ్యాడు. దాంతో మధుబాబును శుక్రవారం పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు. ఈ నెల 6, 7 తేదీల్లో హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియంలో ఆల్‌ఇండియా మాస్టర్ అథ్లెటిక్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొన్న మధుబాబు అద్భుత ప్రతిభ కనబరిచి 800 మీటర్ల పరుగు పందెంలో గోల్డ్ మెడల్, 100 మీటర్ల పరుగు పందెంలో సిల్వర్ మెడల్, 1500 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకాన్ని కై వసం చేసుకున్నాడు. 4x1500 మీటర్ల పరుగు పందెంలోనూ బంగారు పతకం సాధించాడు. దాంతో మధుబాబును థాయిలాండ్‌లో నిర్వహించనున్న అంతర్జాతీయ అథ్లెటిక్ పోటీలకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయన్ను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గంగాధర్, ఉపాధ్యాయులు, అభినందించారు.
గిద్దలూరు రూరల్: పురుగుల మందు కలిసిన కుడితి తాగి మూడు పాడిగేదెలు మృతిచెందిన సంఘటన గిద్దలూరు మండలంలోని కంచిపల్లె గ్రామంలో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన బూతరాజు గురవయ్య పాడిగేదెలకు గుర్తుతెలియని వ్యక్తులు కుడితిలో పురుగుల మందు కలిపి తాగించారు. దీంతో నాలుగు పాడిగేదెల నోటి నుంచి నురుగు వచ్చి కిందపడి గిలగిలా కొట్టుకున్నాయి. గమనించిన గురవయ్య పశువైద్యశాఖ ఏడీ బాలునాయక్‌కు సమాచారం అందించారు. పశువైద్యాధికారి శ్రావణ్‌కుమార్ తన సిబ్బందితో సంఘటన స్థలం వద్దకు చేరుకుని వైద్య సేవలు అందించారు. ఈలోగా మూడు పాడిగేదెలు మృతి చెందాయి. ఒకటి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడింది. ఈ ఘటనపై బాధితుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మూడు పాడిగేదెల మృతితో సుమారు రూ.2 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు గురవయ్య తెలిపాడు.
ఒంగోలు సబర్బన్: సఖి వన్‌స్టాప్ సెంటర్ కోసం అత్యవసర సేవలకు వినియోగించుకునేందుకు వాహనాన్ని కలెక్టర్ పి.రాజాబాబు కలెక్టరేట్ ప్రాంగణంలో శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మిషన్ శక్తి పథకం ద్వారా నిర్వహిస్తున్న సఖి వన్ స్టాప్ సెంటర్‌కు కేటాయించిన ఈ వాహనం ద్వారా అత్యవసర విపత్కర పరిస్థితుల్లో ఉన్న మహిళలు, బాలికలను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించే వెసులుబాటు ఉందన్నారు. ఇబ్బందుల్లో ఉన్న మహిళలు లేదా పిల్లలు టోల్ ఫ్రీ నంబర్ 181 లేదా 1098 కు కాల్ చేసి తక్షణ సేవలను పొందవచ్చన్నారు. సఖి వన్ స్టాప్ సెంటర్లు 24 గంటలు అందుబాటులో ఉండి తాత్కాలిక ఆశ్రయం, తక్షణ వైద్య సహాయం, పోలీస్ సహాయం, న్యాయ సహాయం, కౌన్సెలింగ్ తదితర సేవలను అందజేస్తాయని చెప్పారు. కార్యక్రమంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్ సువర్ణ, సఖి వన్ స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ జ్యోతి సుప్రియ డీసీపీఓ పీ దినేష్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
టంగుటూరు: జనవరి 9 నుంచి 11వ తేదీ వరకు మహారాష్ట్రలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి షూటింగ్ బాల్ చాంపియన్‌షిప్‌కు తుల్లిబల్లి క్రాంతి కుమార్ ఎంపికై నట్లు ప్రకాశం జిల్లా కోచ్ గుడిపల్లి మురళి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సీనియర్ పురుషుల షూటింగ్ బాల్ జట్టు తరఫున క్రాంతి కుమార్ ప్రాతినిధ్యం వహిస్తుండటంపై హర్షం వ్యక్తం చేశారు. జాతీయస్థాయిలో వ్యక్తిగత క్రీడా నైపుణ్యం ప్రదర్శించాలని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పరశురాముడు ఆకాంక్షించారు.
అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్‌కు మధుబాబు
అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్‌కు మధుబాబు
అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్‌కు మధుబాబు


