11 మంది సీనియర్ సహాయకులకు పదోన్నతి
● ఉత్తర్వులు అందజేసిన జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ
ఒంగోలు సిటీ: జిల్లా ప్రజా పరిషత్ యాజమాన్యం పరిధిలోని వివిధ కార్యాలయాల్లో పనిచేస్తున్న 11 మంది సీనియర్ సహాయకులకు పరిపాలనాధికారులుగా పదోన్నతి కల్పించారు. ఆ ఉత్తర్వులను జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ శుక్రవారం వారికి అందజేశారు. పదోన్నతి పొందిన వారిలో జి.సుగుణశోభారాణిని ఒంగోలు జెడ్పీకి, ఎం.శ్రీవాణిని ఒంగోలు జెడ్పీకి, ఎం.ఇందిరను మర్రిపూడి ఎంపీపీ, డి.ఖాసీంపీరాను బేస్తవారిపేట ఎంపీపీ, సీహెచ్‌వీ కోటేశ్వరరెడ్డిని కంభం ఎంపీపీ, సీహెచ్ ప్రసూనను సంతనూతలపాడు ఎంపీపీ, జి.పద్మనాభరెడ్డిని దోర్నాల ఎంపీపీ, ఎం.రూపాదేవిని తాళ్లూరు ఎంపీపీ, వి.సుధాకరరెడ్డిని దర్శి ఎంపీపీ, వి.శ్రీనివాసులరెడ్డిని శింగరాయకొండ ఎంపీపీ, బీఎస్‌వీ ప్రసాద్‌ను సంతమాగులూరు ఎంపీపీకి బదిలీ చేసి ఉత్తర్వులు అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ చిరంజీవి, డిప్యూటీ సీఈఓ పి.బాలమ్మ, పరిపాలనాధికారి చల్లా శ్రీనివాస్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
మేదరమెట్ల: రావినూతలలో సంక్రాంతి కప్–2026 టీ20 అంతర్‌రాష్ట్ర క్రికెట్ టోర్నీ శుక్రవారం ప్రారంభమైంది. రావినూతల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలను మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్యన్నారాయణ ప్రారంభించారు. ఉదయం మ్యాచ్‌లో ఏస్ప్రె లెవెన్ హైదరాబాద్ జట్టుపై ఏసీసీ లెవెన్ విజయవాడ జట్టు విజయం సాధించింది. మధ్యాహ్నం మ్యాచ్‌లో క్లాసిక్ లెవెన్ సీసీ జట్టుపై జీడీసీఏ లెవెన్ గుంటూరు టీమ్ గెలుపొందింది. ప్రారంభ కార్యక్రమంలో కొమ్మారెడ్డి పట్టాభిరామ్, కరణం చెంచుపున్నయ్యచౌదరి, గళ్లా రామచంద్రరావు, అమరనేని ఆంజనేయులు, పూరిమెట్ల లక్ష్మీరమేష్, డీఎల్‌డీఓ సువార్తమ్మ, అసోసియేషన్ అధ్యక్షుడు కారుసాల నాగేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కాగా శనివారం ఉదయం స్పార్టన్ వారియర్స్ తిరుపతి–సౌత్ జోన్ సీసీ చైన్నె జట్లు, మధ్యాహ్నం ఎంఆర్‌సీసీ చైన్నె–ఓకేషనల్ సీసీ బెంగళూరు జట్లు తలపడనున్నాయని నిర్వాహకులు తెలిపారు.
11 మంది సీనియర్ సహాయకులకు పదోన్నతి


