కులమతాలకు అతీతంగా గంధ మహోత్సవం
● గంధ మహోత్సవానికి హాజరైన జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ
తాళ్లూరు: కులమతాలకు అతీతంగా గంధ మహోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందని జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. మండలంలోని తూర్పుగంగవరం గ్రామంలో హజరత్ సయ్యద్ నాగూర్ మీరావళి షరీఫ్ దర్గా ద్వితీయ గంధ మహోత్సవానికి శుక్రవారం ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా దర్గా పూజారి షేక్.ఖాసీంవళి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వెంకాయమ్మ మాట్లాడుతూ గంధ మహోత్సవం జరుపుకోవడం వలన ప్రజలకు మంచి జరుగుతుందని ఆకాంక్షించారు. దర్గా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో దాదాపు 7 వేల మందికి అన్నదానం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు తూము సుబ్బారెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోశం మధుసూదన్‌రెడ్డి, జిల్లా కోఆప్షన్ సభ్యుడు షేక్ ఆదాం షరీఫ్, మాజీ ఎంపీపీ గోళ్లపాటి మోషే, ఉపాధ్యక్షుడు పులి ప్రసాద్‌రెడ్డి, ఆలోకం హరిబాబు, మండల నాయకులు షేక్ లతీఫ్ (బచ్చా), గూడా గోపాల్‌రెడ్డి, షేక్ లతీఫ్, కటకంశెట్టి శ్రీనివాసరావు, పూనూరి దేవదానం, గోపు శ్రీనువాసరెడ్డి, గువ్వల శ్రీనివాసరెడ్డి, కొర్రపాటి విష్ణు, యత్తపు మధుసూదన్‌రెడ్డి, జక్కుల రామకృష్ట, గుజ్జుల యోగిరెడ్డి, గుజ్జుల వెంకటేశ్వరరెడ్డి (గోల్డ్), షేక్ మస్తాన్‌వళి, సైదా, అలీషా కాలేషా, ఖాసీంవలి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.


