కాలువలో జారిపడి వైఎస్సార్ సీపీ నాయకుని మృతి
సంతమాగులూరు (అద్దంకి ): ప్రమాదవశాత్తు సాగర్ కాలువలో కాలు జారి పడి మండలంలోని మావిళ్లపల్లికి చెందిన వైఎస్సార్ సీపీ మండల చేనేత విభాగం అధ్యక్షుడు చిమటా రాంబాబు (36) గురువారం గల్లంతయ్యాడు. గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు శుక్రవారం మృతదేహాన్ని గుర్తించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్డర్ చింతలపూడి అశోక్‌కుమార్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. మృతదేహానికి నివాళులర్పించారు. మృతునికి భార్య నాగలక్ష్మి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ వూట్ల నాగేశ్వరరరావు, సర్పంచ్ డి.సుబ్బారావు, స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు ఉన్నారు.
అర్ధవీడు: మండలంలోని మాగుటూరు గ్రామంలో ఓ రైతు సాగు చేస్తున్న పొగాకు తోటలో 7 గంజాయి మొక్కలను ఎకై ్సజ్ అధికారులు గుర్తించారు. గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని, రైతును విచారిస్తున్నారు. గంజాయి సాగు చేస్తే చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఎకై ్సజ్ అధికారులు హెచ్చరించారు.
మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన అశోక్‌కుమార్
కాలువలో జారిపడి వైఎస్సార్ సీపీ నాయకుని మృతి


