పచ్చ నేతల పత్తేపారం! | - | Sakshi
Sakshi News home page

పచ్చ నేతల పత్తేపారం!

Sep 3 2025 4:25 AM | Updated on Sep 3 2025 4:25 AM

పచ్చ నేతల పత్తేపారం!

పచ్చ నేతల పత్తేపారం!

పొన్నలూరు:

ధికారం చేతిలో ఉండగానే నాలుగురాళ్లు వెనకేసుకోవడానికి టీడీపీ నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఇంటి నిర్మాణాల కోసం మట్టి తీసుకెళ్తున్న సామాన్య ప్రజలపై బెదిరింపులకు పాల్పడుతూ వసూళ్ల దందాకు తెరలేపారు. ఇదేమని ప్రశ్నించిన వారిని పోలీస్‌ కేసులు పెట్టిస్తామని బెదిరించి అందినకాడికి దోచుకుంటూ జేబులు నింపుకొంటున్నారు. ఈ తంతు పొన్నలూరు మండలంలోని కె.అగ్రహరంలో గత నెల రోజులుగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. వివరాల్లోకి వెళ్తే.. కె.అగ్రహరం గ్రామ శివారులో కొంత నాణ్యమైన మట్టి దిబ్బలు ఉన్నాయి. అయితే స్థానిక ప్రజలతో పాటు చుట్టు పక్కల గ్రామాలకు చెందిన వారు వారి ఇంటి నిర్మాణాలతో పాటు ఇళ్ల ముందు మెరకలు చదును చేయడానికి ట్రాక్టర్లతో మట్టి తీసుకెళ్తుంటారు. ఇందులో ఎవరి ప్రమేయం లేకుండా, డబ్బు చెల్లించకుండా స్థానికులు తమ గృహావసరాల కోసం మట్టి తోలుకుంటుంటారు. అయితే స్థానిక టీడీపీ నాయకుల కన్ను మట్టి తోలుకునే వారిపై పడింది. మట్టి దిబ్బలు తమ సొంతమైనట్టు భావించి ఆంక్షలకు తెరలేపారు. గృహావసరాల కోసం మట్టిని తీసుకెళ్తున్న వారిని బెదిరించి వసూళ్ల పర్వాన్ని ప్రారంభించారు. స్థానికులు తమ అవసరాల నిమిత్తం మట్టి తీసుకెళ్లాలంటే ట్రాక్టర్‌ ట్రక్కుకు రూ.200 చెల్లించాల్సిందేనని టీడీపీ నేతలు అల్టిమేటం జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. గత నెల రోజులుగా అక్రమ దందా సాగుతున్నా ఏ అధికారీ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు.

కేసులు పెట్టిస్తామని బెదిరింపు

మట్టి తీసుకెళ్లే వారు డబ్బు ఇవ్వని పక్షంలో అక్రమ కేసులు బనాయిస్తామని టీడీపీ నాయకులు బెదిరిస్తున్నట్లు సమాచారం. అలాగే సంబంధిత పంచాయతీ అధికారులతో స్థానికంగా మట్టి తోలుకునే వారి దగ్గరకు పంపించి బెదిరిస్తున్నారు. ఇదేమి పద్ధతి అని ఎదురు ప్రశ్నించిన వారిని దుర్భాషలాడటమే కాకుండా దాడికి ప్రయత్నిస్తుండటంతో మిన్నకుండిపోవాల్సి వస్తోందని స్థానికులు చెబుతున్నారు. మట్టి మాటున వేల రూపాయలు పోగేసుకున్న టీడీపీ నాయకులు.. సొంత పార్టీ సానుభూతిపరుల వద్ద కూడా డబ్బు వసూలు చేయడంతో వారు సైతం లోలోన రగిలిపోతున్నారు.

పొన్నలూరు మండలం కె.అగ్రహారంలో

టీడీపీ నేతల వసూళ్ల దందా

ఇళ్లకు మట్టి తోలుకునే వారిని బెదిరించి

మరీ డబ్బు వసూలు

మట్టి తోలితే ట్రక్కుకు రూ.200 ఇవ్వాలని డిమాండ్‌

ఇవ్వకుంటే పోలీసు కేసులు పెట్టిస్తామని

బెదిరింపులు

టీడీపీ నేతల అక్రమ వసూళ్లపై గ్రామస్తుల ఆగ్రహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement