ప్రభుత్వ భూముల్లో అక్రమ మైనింగ్‌పై హైకోర్టు కొరడా | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ భూముల్లో అక్రమ మైనింగ్‌పై హైకోర్టు కొరడా

Sep 5 2025 5:46 AM | Updated on Sep 5 2025 5:46 AM

ప్రభుత్వ భూముల్లో అక్రమ మైనింగ్‌పై హైకోర్టు కొరడా

ప్రభుత్వ భూముల్లో అక్రమ మైనింగ్‌పై హైకోర్టు కొరడా

చీమకుర్తి: ప్రభుత్వ భూములను అడ్డగోలుగా ఆక్రమించుకొని దొడ్డిదారిలో అక్రమ మైనింగ్‌ చేస్తున్న గ్రానైట్‌ క్వారీలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు కొరడా ఝుళిపించింది. సొసైటీ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ సివిల్‌ ప్రాపర్టీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ రైట్స్‌ అనే స్వచ్ఛద సంస్థ జిల్లా అధ్యక్షుడు పి.హేబేలు హైకోర్టులో దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు ఘాటుగా స్పందించింది. బుధవారం ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాగూర్‌, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరపున న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్‌ తమ వాదనలు వినిపించారు. చీమకుర్తి మండలంలోని ఆర్‌ఎల్‌ పురం పంచాయితీలోని సర్వే నంబర్‌ 66/1లో జయమినరల్స్‌, సర్వే నంబర్లు 67/1ఏ, 67/2ఏ, 69/2, 70/2, 70/3 లలో హంస గ్రానైట్‌ , బూదవాడ పంచాయతీలోని సర్వేనెంబర్‌లు 107, 108 లో ఎన్‌వీ ఎక్స్‌పోర్ట్‌లో అన్ని గ్రానైట్‌ గ్రానైట్‌ క్వారీలన్నీ కలిపి మొత్తం 18.17 ఎకరాల ప్రభుత్వ భూమిలో అక్రమ మైనింగ్‌ చేస్తున్నట్లు పిటిషనర్‌ న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. దాని వల్ల కలిగే అనర్థాలపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ స్పందించకపోవడంతో చేసేది లేక ఫిర్యాదుదారుడు హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో స్పందించిన హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు జరుగుతుంటే అధికారులు ఎందుకు స్పందించలేదని, ఈ ఆక్రమణలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో 6 వారాల లోగా నివేదిక తమ ముందు ఉంచాలని కలెక్టర్‌, జిల్లా రెవెన్యూ, మైనింగ్‌ అధికారులను ఆదేశిస్తూ గ్రానైట్‌ కంపెనీలకు నోటీసులు జారీ చేస్తూ విచారణను 6 వారాలకు వాయిదా వేశారు.

ఇరిగేషన్‌ భూములతో మాకేం సంబంధం

గ్రానైట్‌ క్వారీల యాజమాన్యం ఆక్రమించుకున్న భూములు ఇరిగేషన్‌ శాఖకు చెందినవి. ఆ భూముల గురించి ఆ శాఖ ఎస్‌ఈ, ఈఈ, డీఈ, ఏఈలు చూసుకోవాలి. మాపై బురద చల్లే పనులు చేస్తున్నారే తప్ప ఇరిగేషన్‌ శాఖ వారిని అడగాలి. కాలువలు, వాగులు, వంకల భూములు ఆక్రమించుకొని క్వారీయింగ్‌ చేస్తుంటే మాకేం సంబంధం.

– రాజశేఖర్‌, మైన్స్‌ డీడీ, ఒంగోలు

సాగర్‌ నీటి పరీవాహక కాలువలు, భూములపై గ్రానైట్‌ క్వారీల అక్రమ మైనింగ్‌

హంస గ్రానైట్‌, జయమినరల్స్‌, ఎన్‌వీ

ఎక్స్‌పోర్ట్స్‌కి చెందిన క్వారీ యాజమాన్యంపై హైకోర్టు సీరియస్‌

స్వచ్ఛంద సంస్థ తరఫున హైకోర్టులో

ప్రజాప్రయోజనాల వ్యాజ్యం

6 వారాల లోగా నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌, మైన్స్‌ డీడీ, రెవెన్యూ అధికారులకు హైకోర్టు నోటీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement